ఏమి నేరిచితివి యేడలేని సుద్దు లేల
(॥పల్లవి॥)
ఏమి నేరిచితివి యేడలేని సుద్దు లేల
వేమారు గొల్లెతలును విడిచిరి సిగ్గులు
(॥ఏమి॥)
తేనెలుట్టిపడ నీవు తియ్యనిమాట లాడేవు
నానఁ బెట్టేవు వలపు నయములనె
లోను గాకెట్టు మాను లోలత నీ చేఁతలకు
దీనికే పురసతులు తేలిరి నీవాగెకు
(॥ఏమి॥)
వెన్నెల రసాలు గార వేడుకకు నవ్వేవు
కన్నులనే తరితీపు గాదెఁ బోసేవు
కన్నవారు విన్నవారు కాకు గాక మానుదురా
మున్నిందుకే చుప్పనాఁతి మోహించె నీకును
(॥ఏమి॥)
పాలుగారే సిగ్గులను బంతికూళ్లు గుడిపేవు
కేలు సాఁచి మర్మాలంటి గిలిగించేవు
యీలీల శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
ఆలకించి కబ్జ నీకు నన్నిటా వలచెను
(||pallavi||)
emi nerisidivi yeḍaleni suddu lela
vemāru gŏllĕdalunu viḍisiri siggulu
(||emi||)
tenĕluṭṭibaḍa nīvu tiyyanimāḍa lāḍevu
nānam̐ bĕṭṭevu valabu nayamulanĕ
lonu gāgĕṭṭu mānu lolada nī sem̐talagu
dīnige purasadulu teliri nīvāgĕgu
(||emi||)
vĕnnĕla rasālu gāra veḍugagu navvevu
kannulane taridību gādĕm̐ bosevu
kannavāru vinnavāru kāgu gāga mānudurā
munniṁduge suppanām̐ti mohiṁchĕ nīgunu
(||emi||)
pālugāre siggulanu baṁtigūḽlu guḍibevu
kelu sām̐si marmālaṁṭi giligiṁchevu
yīlīla śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
ālagiṁchi kabja nīgu nanniḍā valasĕnu