Emi neramulemchevu yemdaamkaanu

ఏమి నేరములెంచేవు యెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఏమి నేరములెంచేవు యెందాఁకాను
గామిడితనాన నుంటేఁ గడురేఁచుట గాదా

(॥ఏమి॥)
కొప్పు వట్టి తీసి నీవు గోర గీరఁగాఁ జెలికి
ముప్పిరిఁ జెక్కంటరాదా తప్పాయిది
వుప్పతిల్ల మొదల నీ వుద్దండాలు సేసితేను
అప్పుడే చేఁతకుఁ జేఁతకప్పణించుట గాదా

(॥ఏమి॥)
పాదాల బిగించి పట్టి పడఁతిఁ గాఁగిలించఁగ
తోదోపు లాడఁగరాదా దోసమా యిది
సాదువలెనున్న వారి సదమదము సేసితే
పాదుకొని నిన్ను సూడుపట్టుమనుట గాదా

(॥ఏమి॥)
పానుపుపైఁగూడి నీవు పరవశమందించఁగ
మేనిపై నొరఁగరాదా మీరుటా యిది
మేనవారిఁ బెండ్లాడితే మెచ్చగ శ్రీ వేంకటేశ
యీ నెపాన నీవుర మెక్కుమనుటగాదా

(||pallavi||)
emi neramulĕṁchevu yĕṁdām̐kānu
gāmiḍidanāna nuṁṭem̐ gaḍurem̐suḍa gādā

(||emi||)
kŏppu vaṭṭi tīsi nīvu gora gīram̐gām̐ jĕligi
muppirim̐ jĕkkaṁṭarādā tappāyidi
vuppadilla mŏdala nī vuddaṁḍālu sesidenu
appuḍe sem̐tagum̐ jem̐tagappaṇiṁchuḍa gādā

(||emi||)
pādāla bigiṁchi paṭṭi paḍam̐tim̐ gām̐giliṁcham̐ga
todobu lāḍam̐garādā dosamā yidi
sāduvalĕnunna vāri sadamadamu seside
pādugŏni ninnu sūḍubaṭṭumanuḍa gādā

(||emi||)
pānububaim̐gūḍi nīvu paravaśhamaṁdiṁcham̐ga
menibai nŏram̐garādā mīruḍā yidi
menavārim̐ bĕṁḍlāḍide mĕchchaga śhrī veṁkaḍeśha
yī nĕbāna nīvura mĕkkumanuḍagādā