ఏమి నెరపేవు మేకు లింతులెల్లా జూడఁగాను
(॥పల్లవి॥)
ఏమి నెరపేవు మేకు లింతులెల్లా జూడఁగాను
ఆమని వేడుకకాఁడ వౌదువయ్య నీవు
(॥॥)
నీవద్దఁ గాచుకున్న నెలఁతుక వుండఁగాను
ఆవలాకెతో సరసమాడేవు
తోవలఁ బెళ్ళిచెట్లు మందుగాదనినమాటలు
నీవల్లనే కానవచ్చె నెమ్మది నిందరికి
(॥॥)
వరుసతోఁ బెండ్లాడినవనిత మాటాడఁగాను
పొరుగాపెతో నవ్వేవు పోరచిగాను
సరినున్న మేనవారు సరకుగా రనుమాట
నిరతితోడుత నీవే నిజము సేసితివి
(॥॥)
అలమేలుమంగ వురమందు నిట్టెవుండఁగాను
ఇల వీఁపెక్కించుకొంటి వెన్నికగాను
భళి శ్రీ వేంకటేశుఁడ పైకొసరు లాభమని
తెలిపితి విందరికి తేట తెల్లమిగాను
(||pallavi||)
emi nĕrabevu megu liṁtulĕllā jūḍam̐gānu
āmani veḍugagām̐ḍa vauduvayya nīvu
(||||)
nīvaddam̐ gāsugunna nĕlam̐tuga vuṁḍam̐gānu
āvalāgĕdo sarasamāḍevu
tovalam̐ bĕḽḽisĕṭlu maṁdugādaninamāḍalu
nīvallane kānavachchĕ nĕmmadi niṁdarigi
(||||)
varusadom̐ bĕṁḍlāḍinavanida māḍāḍam̐gānu
pŏrugābĕdo navvevu porasigānu
sarinunna menavāru saragugā ranumāḍa
niradidoḍuda nīve nijamu sesidivi
(||||)
alamelumaṁga vuramaṁdu niṭṭĕvuṁḍam̐gānu
ila vīm̐pĕkkiṁchugŏṁṭi vĕnnigagānu
bhaḽi śhrī veṁkaḍeśhum̐ḍa paigŏsaru lābhamani
tĕlibidi viṁdarigi teḍa tĕllamigānu