Emi neegu tamagamo yeramga nenu

ఏమి నీకు తమకమో యెరఁగ నేను
Language

(॥పల్లవి॥)
ఏమి నీకు తమకమో యెరఁగ నేను
వాములాయ పులకలు వట్రువ నా చన్నుల

(॥ఏమి॥)
చేరి యాల పట్టేవు నాచేఁకట
యేరా యెంతలేదు నీయేఁకట
ఆరజము సేయకు మమ్మందరిలోన
చేరెఁడేసీ కురిసె నీచెమట నామేన

(॥ఏమి॥)
సూటిగానేమి చూచేవు చొక్కపుమోవి
తేటగానందునున్నది తియ్యనితావి
యేఁటికి రేఁచేవు సారెనిటె నాసిగ్గు
గాఁటపు నానగవులె కప్పురపు ముగ్గు

(॥ఏమి॥)
కందువమేలిదివో నాకాఁగిట
విందు నీసుద్దులెల్లా భావించి లోఁగిట
చెంది నీచింతలో శ్రీ వెంకటేశ
సందడినొండొంటితో చన్నులు రాశె

(||pallavi||)
emi nīgu tamagamo yĕram̐ga nenu
vāmulāya pulagalu vaṭruva nā sannula

(||emi||)
seri yāla paṭṭevu nāsem̐kaḍa
yerā yĕṁtaledu nīyem̐kaḍa
ārajamu seyagu mammaṁdarilona
serĕm̐ḍesī kurisĕ nīsĕmaḍa nāmena

(||emi||)
sūḍigānemi sūsevu sŏkkabumovi
teḍagānaṁdununnadi tiyyanidāvi
yem̐ṭigi rem̐sevu sārĕniḍĕ nāsiggu
gām̐ṭabu nānagavulĕ kappurabu muggu

(||emi||)
kaṁduvamelidivo nāgām̐giḍa
viṁdu nīsuddulĕllā bhāviṁchi lom̐giḍa
sĕṁdi nīsiṁtalo śhrī vĕṁkaḍeśha
saṁdaḍinŏṁḍŏṁṭido sannulu rāśhĕ