ఏమి నీ వొళ్లఁ గల్లలేమైనాఁ గలవో
(॥పల్లవి॥)
ఏమి నీ వొళ్లఁ గల్లలేమైనాఁ గలవో
చే ముంచి కొసరరాఁగా శిరసు వంచేవే
(॥ఏమి॥)
యెదురుగావచ్చి నీకే యితవు సేయరాఁగా
చెదరుచు నీవేల చిన్నఁబోయేవు
వెదకి వచ్చి నీకు విడెము నే నియ్యరాఁగా
పెదవులు దడిపి సిబ్బితిఁ బొందేవు
(॥ఏమి॥)
వొద్దనే కూచుండి నిన్నువుపచరించరాఁగా
అద్దుకప్రియాలుచెప్పే వప్పటి నీవు
సుద్దులు చెప్పుచు నీతో చుట్టరికానకు రాఁగా
కొద్దిమీర నీకు నీవే కొంకి లోఁగేవు
(॥ఏమి॥)
కాఁగిలించుకొని నీతోకాఁపురము సేయరాఁగా
మాఁగినమోవిగంటికి మరఁగిడేవు
చేఁగదేరఁ గూడి మొక్క శ్రీవేంకటేశ నే రాఁగా
వేఁగాటిపిఱుఁదు చూచి వెరగందేవు
(||pallavi||)
emi nī vŏḽlam̐ gallalemainām̐ galavo
se muṁchi kŏsararām̐gā śhirasu vaṁcheve
(||emi||)
yĕdurugāvachchi nīge yidavu seyarām̐gā
sĕdarusu nīvela sinnam̐boyevu
vĕdagi vachchi nīgu viḍĕmu ne niyyarām̐gā
pĕdavulu daḍibi sibbidim̐ bŏṁdevu
(||emi||)
vŏddane kūsuṁḍi ninnuvubasariṁcharām̐gā
addugapriyālusĕppe vappaḍi nīvu
suddulu sĕppusu nīdo suṭṭarigānagu rām̐gā
kŏddimīra nīgu nīve kŏṁki lom̐gevu
(||emi||)
kām̐giliṁchugŏni nīdogām̐puramu seyarām̐gā
mām̐ginamovigaṁṭigi maram̐giḍevu
sem̐gaderam̐ gūḍi mŏkka śhrīveṁkaḍeśha ne rām̐gā
vem̐gāḍibiṟum̐du sūsi vĕragaṁdevu