Emi nee kimta baluvu yevva richchiri

ఏమి నీ కింత బలువు యెవ్వ రిచ్చిరి
Language

(॥పల్లవి॥)
ఏమి నీ కింత బలువు యెవ్వ రిచ్చిరి
మావిూఁది చలములు మాను మన్నా మానవు

(॥ఏమి॥)
వాడుమోము వంటి నీతో వలపు చెప్పితినో
కూడు మని బత్తి నీకు గొట్టానఁ బెట్టితనో
యేడనుండో వచ్చి నీవు యిచ్చకము లెల్ల నాడి
వోడక వేఁడుకొనేవు వొపనన్నామానవు

(॥ఏమి॥)
వట్టి చనవు సేసుక వద్దికి వచ్చితినో
రట్టుతోడ రమ్మని యాఱడిఁ బెట్టేనో
గుట్టుతో నుండక నన్ను కొంగువట్టి తీసినీవే
తట్టువడఁ బెనఁగేవు తగ దన్నా మానవు

(॥ఏమి॥)
కన్ను లార్చి నీమీఁద కాఁకలు చల్లితినో
తిన్ననిమాటల తరితీపులు సేసితినో
కన్నచో శ్రీవేంకటాద్రికడపరాయఁడవై
సన్నలఁ గూడితి వింకాఁ జాలు నన్నా మానవు

(||pallavi||)
emi nī kiṁta baluvu yĕvva richchiri
māviూm̐di salamulu mānu mannā mānavu

(||emi||)
vāḍumomu vaṁṭi nīdo valabu sĕppidino
kūḍu mani batti nīgu gŏṭṭānam̐ bĕṭṭidano
yeḍanuṁḍo vachchi nīvu yichchagamu lĕlla nāḍi
voḍaga vem̐ḍugŏnevu vŏbanannāmānavu

(||emi||)
vaṭṭi sanavu sesuga vaddigi vachchidino
raṭṭudoḍa rammani yāṟaḍim̐ bĕṭṭeno
guṭṭudo nuṁḍaga nannu kŏṁguvaṭṭi tīsinīve
taṭṭuvaḍam̐ bĕnam̐gevu taga dannā mānavu

(||emi||)
kannu lārsi nīmīm̐da kām̐kalu sallidino
tinnanimāḍala taridībulu sesidino
kannaso śhrīveṁkaḍādrigaḍabarāyam̐ḍavai
sannalam̐ gūḍidi viṁkām̐ jālu nannā mānavu