Emi navvulu navvevu yemdaamkaa sarasamu

ఏమి నవ్వులు నవ్వేవు యెందాఁకా సరసము
Language

(॥పల్లవి॥)
ఏమి నవ్వులు నవ్వేవు యెందాఁకా సరసము
తేమచెమటలు నిండె తెర వేయవయ్యా

(॥ఏమి॥)
కోమలిని రమ్మంటా కొంగు నీవు వట్టితేను
మోము చూడఁగానే పోఁకముడి వీడెను
చేముంచి చేతఁబట్టి(ట్ట?) సిగ్గుపడె నంతలోనే
కామించి నీపచ్చడము గప్పరాదా యిపుడు

(॥ఏమి॥)
పెనఁగి చుట్టరికాన ప్రియము నీవు చెప్పఁగా
ననువుగ నప్పటి పయ్యద జారెను
వొనర వేరొకచోత నొగిఁ బట్టి సిగ్గువడీ
తనివోని వేడుకతో తలుపు మూయరాదా

(॥ఏమి॥)
చేయిచాఁచి రతికిని సేసనీవు వెట్టఁగాను
ఆయెడఁ జెంపపై తురు మటుజారెను
పాయక శ్రీవేంకటేశ పట్టరాక సిగ్గువడీ
యీయెడఁ గాఁగిటఁ గూడి ఇట్టె వుండు మిఁకను

(||pallavi||)
emi navvulu navvevu yĕṁdām̐kā sarasamu
temasĕmaḍalu niṁḍĕ tĕra veyavayyā

(||emi||)
komalini rammaṁṭā kŏṁgu nīvu vaṭṭidenu
momu sūḍam̐gāne pom̐kamuḍi vīḍĕnu
semuṁchi sedam̐baṭṭi(ṭṭa?) siggubaḍĕ naṁtalone
kāmiṁchi nībachchaḍamu gapparādā yibuḍu

(||emi||)
pĕnam̐gi suṭṭarigāna priyamu nīvu sĕppam̐gā
nanuvuga nappaḍi payyada jārĕnu
vŏnara verŏgasoda nŏgim̐ baṭṭi sigguvaḍī
tanivoni veḍugado talubu mūyarādā

(||emi||)
seyisām̐si radigini sesanīvu vĕṭṭam̐gānu
āyĕḍam̐ jĕṁpabai turu maḍujārĕnu
pāyaga śhrīveṁkaḍeśha paṭṭarāga sigguvaḍī
yīyĕḍam̐ gām̐giḍam̐ gūḍi iṭṭĕ vuṁḍu mim̐kanu