ఏమి నవ్వులు నవ్వే వెఱిఁగెఱిఁగుండి నీవు
(॥పల్లవి॥)
ఏమి నవ్వులు నవ్వే వెఱిఁగెఱిఁగుండి నీవు
కాముకురాలైనదానిఁ గాఁగిలించరాదా
(॥ఏమి॥)
చెక్కిటి చెమటతోడ చెలి నీవద్దికి వచ్చె
వుక్కుమీరి చన్నుఁజన్ను నొరయఁగాను
యెక్కుడైనయాసలతో నెదుట నిలుచున్నది
గక్కన నలపుదీరఁ గాఁగిలించరాదా
(॥ఏమి॥)
కుమ్ముడిజారుతోడఁ గోరి నీవద్దికి వచ్చె
కమ్మవిరులు వీఁపుపైఁ గడురాలఁగా
నిమ్మపండ్లుకానుక నీకు నొసఁగీ నదె
కమ్ముకొని లాలించి గాఁగిలించరాదా
(॥ఏమి॥)
మదముప్పొంగ నలమేల్‌మంగ నీవద్దికి వచ్చె
గుదిగొన్నవాసనలు గుబులుకోఁగా
యేదపై శ్రీవేంకటేశ ఇరవాయఁ గూడితివి
కదిసి ఇంకానింకా కాఁగిలించరాదా
(||pallavi||)
emi navvulu navve vĕṟim̐gĕṟim̐guṁḍi nīvu
kāmugurālainadānim̐ gām̐giliṁcharādā
(||emi||)
sĕkkiḍi sĕmaḍadoḍa sĕli nīvaddigi vachchĕ
vukkumīri sannum̐jannu nŏrayam̐gānu
yĕkkuḍainayāsalado nĕduḍa nilusunnadi
gakkana nalabudīram̐ gām̐giliṁcharādā
(||emi||)
kummuḍijārudoḍam̐ gori nīvaddigi vachchĕ
kammavirulu vīm̐pubaim̐ gaḍurālam̐gā
nimmabaṁḍlugānuga nīgu nŏsam̐gī nadĕ
kammugŏni lāliṁchi gām̐giliṁcharādā
(||emi||)
madamuppŏṁga nalamelmaṁga nīvaddigi vachchĕ
gudigŏnnavāsanalu gubulugom̐gā
yedabai śhrīveṁkaḍeśha iravāyam̐ gūḍidivi
kadisi iṁkāniṁkā kām̐giliṁcharādā