Emi navveve naamaada yidi neeveṟamganidaa

ఏమి నవ్వేవే నామాట యిది నీవెఱఁగనిదా
Language

(॥పల్లవి॥)
ఏమి నవ్వేవే నామాట యిది నీవెఱఁగనిదా
చే ముంచి పరులకుఁ జేసినదివో యెప్పుడు

(॥ఏమి॥)
చనవరి వౌదువే సతి నీవు పతికిని
పొనుఁగక నాపై బత్తి కుట్టించరాదా
యెనసి తమకుఁదామే యెవ్వరైనా బతికేరు
ఘనత నొరుల వుపకార మౌటే యెక్కుడు

(॥ఏమి॥)
నేరుపరి వౌదువే నీ విభుని మా ఇంటికి
కోరి వేఁడి తోడితెచ్చి కూడించరాదా
ఆరీతి తాము భోగించిన దెవ్వరెరుఁగుదురు
పేరడిగాఁ జుట్టాలకుఁ బెట్టినదే యెక్కుడు

(॥ఏమి॥)
బలుదాన వౌదువే పక్కన శ్రీ వేంకటేశు
గలయించిట్టె మేలు గలుగరాదా
వలవ నేరరా తాము వనితలు లోలోన
వలపొరులకుఁ జవి వడ్డించుటే యెక్కుడు

(||pallavi||)
emi navveve nāmāḍa yidi nīvĕṟam̐ganidā
se muṁchi parulagum̐ jesinadivo yĕppuḍu

(||emi||)
sanavari vauduve sadi nīvu padigini
pŏnum̐gaga nābai batti kuṭṭiṁcharādā
yĕnasi tamagum̐dāme yĕvvarainā badigeru
ghanada nŏrula vubagāra mauḍe yĕkkuḍu

(||emi||)
nerubari vauduve nī vibhuni mā iṁṭigi
kori vem̐ḍi toḍidĕchchi kūḍiṁcharādā
ārīdi tāmu bhogiṁchina dĕvvarĕrum̐guduru
peraḍigām̐ juṭṭālagum̐ bĕṭṭinade yĕkkuḍu

(||emi||)
baludāna vauduve pakkana śhrī veṁkaḍeśhu
galayiṁchiṭṭĕ melu galugarādā
valava nerarā tāmu vanidalu lolona
valabŏrulagum̐ javi vaḍḍiṁchuḍe yĕkkuḍu