ఏమి నవ్వేవే నాతో యిప్పుడే యెరిఁగించితి
(॥పల్లవి॥)
ఏమి నవ్వేవే నాతో యిప్పుడే యెరిఁగించితి
గామిఁడైన పతి తొల్లే కైలాటకాఁడు
(॥ఏమి॥)
పాయపు దానవు నీవు పంతగత్తెనే నేను
చాయెరిఁగి మాటలాడు సముకానను
చేయి చిక్కి వున్నవాఁడు చెలువుఁడిద్దరికిని
తోయలేఁ డాతఁడు మన దొమ్మి వోపు కొలఁది
(॥ఏమి॥)
పిన్నదాన యించుకంత పెద్దదాన నిదె నేను
సన్నెరిఁగి నవ్వు నవ్వు సముకానను
ఇన్నిటా జాణఁడితఁడు యవ్వరెంత పెనఁగినా
మన్నించి విడేలువెట్టీ మన వోపు కొలఁది
(॥ఏమి॥)
దొరవు నీ వంతకంటే దొరను నేనూడిగాలు
సరవి యెఱిఁగి సేయు సముకానను
సిరులతో నిన్ను నన్ను శ్రీ వేంకటేశుఁడు గూడె
తెరమఱఁగింతే మన తెలివోపు కొలఁది
(||pallavi||)
emi navveve nādo yippuḍe yĕrim̐giṁchidi
gāmim̐ḍaina padi tŏlle kailāḍagām̐ḍu
(||emi||)
pāyabu dānavu nīvu paṁtagattĕne nenu
sāyĕrim̐gi māḍalāḍu samugānanu
seyi sikki vunnavām̐ḍu sĕluvum̐ḍiddarigini
toyalem̐ ḍādam̐ḍu mana dŏmmi vobu kŏlam̐di
(||emi||)
pinnadāna yiṁchugaṁta pĕddadāna nidĕ nenu
sannĕrim̐gi navvu navvu samugānanu
inniḍā jāṇam̐ḍidam̐ḍu yavvarĕṁta pĕnam̐ginā
manniṁchi viḍeluvĕṭṭī mana vobu kŏlam̐di
(||emi||)
dŏravu nī vaṁtagaṁṭe dŏranu nenūḍigālu
saravi yĕṟim̐gi seyu samugānanu
sirulado ninnu nannu śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ
tĕramaṟam̐giṁte mana tĕlivobu kŏlam̐di