ఏమి నాయము చెప్పేవు ఇంతులతోను
(॥పల్లవి॥)
ఏమి నాయము చెప్పేవు ఇంతులతోను
గామిడి కన్నులయితే కసరవద్దా
(॥ఏమి॥)
చెలి సిగ్గుతో నుండఁగ చెరఁగు నీవు వట్టితే
తిలకించి యాపె నిన్నుఁ దిట్టఁగ వద్దా
చెలఁగి యాపె లోన చీర గట్టుకొనేవేళ
కులికి చూడఁగఁ బోతే గొణఁగవద్దా
(॥ఏమి॥)
కొమ్మ యేమీఁ దడవక గుట్టుతోడ నుండఁగాను
దొమ్మిఁ జన్నులంటితేను దొబ్బవద్దా
సొమ్ము వెట్టుకొఁగా నెడచొచ్చి సందులవయి
కుమ్మెగా గోర నూఁదితే కోపించవద్దా
(॥ఏమి॥)
పడఁతి యలపుతోడ పవ్వళించి వుండఁగాను
నడుమఁ గాఁగిలించితే నవ్వవద్దా
యెడయక శ్రీవేంకటేశ నిన్నుఁ గలయఁగ
అడియాలాలు నించితే నట్టె మెచ్చవద్దా
(||pallavi||)
emi nāyamu sĕppevu iṁtuladonu
gāmiḍi kannulayide kasaravaddā
(||emi||)
sĕli siggudo nuṁḍam̐ga sĕram̐gu nīvu vaṭṭide
tilagiṁchi yābĕ ninnum̐ diṭṭam̐ga vaddā
sĕlam̐gi yābĕ lona sīra gaṭṭugŏneveḽa
kuligi sūḍam̐gam̐ bode gŏṇam̐gavaddā
(||emi||)
kŏmma yemīm̐ daḍavaga guṭṭudoḍa nuṁḍam̐gānu
dŏmmim̐ jannulaṁṭidenu dŏbbavaddā
sŏmmu vĕṭṭugŏm̐gā nĕḍasŏchchi saṁdulavayi
kummĕgā gora nūm̐dide kobiṁchavaddā
(||emi||)
paḍam̐ti yalabudoḍa pavvaḽiṁchi vuṁḍam̐gānu
naḍumam̐ gām̐giliṁchide navvavaddā
yĕḍayaga śhrīveṁkaḍeśha ninnum̐ galayam̐ga
aḍiyālālu niṁchide naṭṭĕ mĕchchavaddā