Emi mogasirimamdo yemta nerubaro kaani

ఏమి మొగసిరిమందో యెంత నేరుపరో కాని
Language

(॥పల్లవి॥)
ఏమి మొగసిరిమందో యెంత నేరుపరో కాని
నా మనసు గరఁగించి నవ్వించెనే

(॥ఏమి॥)
యెదుటఁ దనకు నాకు నేఁటిపొందులంటానుంటే
పదకము మెడఁ బెట్టి బ్రమయించెనే
మొదలఁ దనకు నే మొక్కనోపనంటానుంటే
పదరి పాదము నాపైఁ జాఁచెనే

(॥ఏమి॥)
వోపనంటా నోరుమూసుక వూరకే వుండేదాని
పాపట దువ్వి దువ్వి పలికించెనే
రాపుగ నితనితో వెరతునంటా నేనుంటే
మూపున గడ్డము మోపి మొసగోర నూఁదెనే

(॥ఏమి॥)
నమ్మని తనమాటలు నాలి కాఁడంటా వుంటే
సొమ్ములెల్లా మెడఁ బెట్టి చొక్కించెనే
వుమ్మడి శ్రీవేంకటాద్రినుండి వచ్చి మాడుకూరఁ
గమ్మర చెన్నరాయఁడై కాఁగిలించెనే

(||pallavi||)
emi mŏgasirimaṁdo yĕṁta nerubaro kāni
nā manasu garam̐giṁchi navviṁchĕne

(||emi||)
yĕduḍam̐ danagu nāgu nem̐ṭibŏṁdulaṁṭānuṁṭe
padagamu mĕḍam̐ bĕṭṭi bramayiṁchĕne
mŏdalam̐ danagu ne mŏkkanobanaṁṭānuṁṭe
padari pādamu nābaim̐ jām̐sĕne

(||emi||)
vobanaṁṭā norumūsuga vūrage vuṁḍedāni
pābaḍa duvvi duvvi paligiṁchĕne
rābuga nidanido vĕradunaṁṭā nenuṁṭe
mūbuna gaḍḍamu mobi mŏsagora nūm̐dĕne

(||emi||)
nammani tanamāḍalu nāli kām̐ḍaṁṭā vuṁṭe
sŏmmulĕllā mĕḍam̐ bĕṭṭi sŏkkiṁchĕne
vummaḍi śhrīveṁkaḍādrinuṁḍi vachchi māḍugūram̐
gammara sĕnnarāyam̐ḍai kām̐giliṁchĕne