ఏమి మొగము చూచేవు యెన్నటికి నీదయ
(॥పల్లవి॥)
ఏమి మొగము చూచేవు యెన్నటికి నీదయ
చే ముట్టి సరసమాడి సిగ్గుదేర్చరాదా
(॥ఏమి॥)
చెలి నీవద్ద నుండఁగ చెక్కు లెల్లాఁ జెమరించె
వెలయ సురటిఁ గొని విసరరాదా
అలసె నీతో నవ్వి అప్పటి నింతటిలోనే
చలువనీమోవితేనె చవిచూపరాదా
(॥ఏమి॥)
సతి నీతో మాటాడఁగ జల్లుననుఁ బులకించె
గతిగూడ పచ్చడము గప్పరాదా
తతి మేను సోఁకఁగాను తమకములెల్ల రేఁగె
కత లెందాఁకాఁ జెప్పేవు కాఁగిలించరాదా
(॥ఏమి॥)
అంగన సేసవెట్టఁగ ఆయములెల్లఁ గరఁగె
సంగతిగాఁ గౌఁగిలించి చనవీరాదా
రంగుగ శ్రీవేంకటేశ రతిఁ గూడితి వీకెను
ముంగింటనే మోహించె ముచ్చటాడరాదా
(||pallavi||)
emi mŏgamu sūsevu yĕnnaḍigi nīdaya
se muṭṭi sarasamāḍi siggudersarādā
(||emi||)
sĕli nīvadda nuṁḍam̐ga sĕkku lĕllām̐ jĕmariṁchĕ
vĕlaya suraḍim̐ gŏni visararādā
alasĕ nīdo navvi appaḍi niṁtaḍilone
saluvanīmovidenĕ savisūbarādā
(||emi||)
sadi nīdo māḍāḍam̐ga jallunanum̐ bulagiṁchĕ
gadigūḍa pachchaḍamu gapparādā
tadi menu som̐kam̐gānu tamagamulĕlla rem̐gĕ
kada lĕṁdām̐kām̐ jĕppevu kām̐giliṁcharādā
(||emi||)
aṁgana sesavĕṭṭam̐ga āyamulĕllam̐ garam̐gĕ
saṁgadigām̐ gaum̐giliṁchi sanavīrādā
raṁguga śhrīveṁkaḍeśha radim̐ gūḍidi vīgĕnu
muṁgiṁṭane mohiṁchĕ muchchaḍāḍarādā