ఏమి మాయసేసితివో యెవ్వఁ డెఱుఁగుర నిన్ను
(॥పల్లవి॥)
ఏమి మాయసేసితివో యెవ్వఁ డెఱుఁగుర నిన్ను
నాము వలపుఁ దలకు నాకు నెక్కెరా
(॥ఏమి॥)
మాయపునీసుద్దులకు మాటలాడకుండేనన్న
కాయపునాపాయమే కాఁక రేఁచీరా
సోయగానఁ గోపగించి చూపుల జంకించేనన్నా
బాయట నాచెమటలు వచ్చిరేఁచీరా
(॥ఏమి॥)
పొరపొచ్చెముల నిన్ను బొమ్మల జంకించేనన్నా
అరిది నామొగమోటా లడ్డగించీరా
సరవి నీవొట్లకు చక్కఁగా నవ్వేనన్న
సరిగా నాపులకలు సందండించీరా
(॥ఏమి॥)
గొబ్బున నీమోవి గని గుక్కిళ్ళు మింగేనన్నా
అబ్బురపుఁ బరవశ మట్టె ముంచీరా
వుబ్బున శ్రీవేంకటేశ వొగి నన్నుఁ గూడితివి
తబ్బిబ్బై నామతులు తడఁబడీరా
(||pallavi||)
emi māyasesidivo yĕvvam̐ ḍĕṟum̐gura ninnu
nāmu valabum̐ dalagu nāgu nĕkkĕrā
(||emi||)
māyabunīsuddulagu māḍalāḍaguṁḍenanna
kāyabunābāyame kām̐ka rem̐sīrā
soyagānam̐ gobagiṁchi sūbula jaṁkiṁchenannā
bāyaḍa nāsĕmaḍalu vachchirem̐sīrā
(||emi||)
pŏrabŏchchĕmula ninnu bŏmmala jaṁkiṁchenannā
aridi nāmŏgamoḍā laḍḍagiṁchīrā
saravi nīvŏṭlagu sakkam̐gā navvenanna
sarigā nābulagalu saṁdaṁḍiṁchīrā
(||emi||)
gŏbbuna nīmovi gani gukkiḽḽu miṁgenannā
abburabum̐ baravaśha maṭṭĕ muṁchīrā
vubbuna śhrīveṁkaḍeśha vŏgi nannum̐ gūḍidivi
tabbibbai nāmadulu taḍam̐baḍīrā