ఏమి జూజాలాడేవు యెక్కడ చూచేవు నీవు
(॥పల్లవి॥)
ఏమి జూజాలాడేవు యెక్కడ చూచేవు నీవు
కామినిఁ జేకొనవయ్య కప్పురమీవయ్య
(॥॥)
సేస కొప్పు వంచుకొని చెక్కునఁ జెయ్యిడుకొని
ఆసపాటుఁజూపు నీపై నట్టే చల్లీని
వాసులకు బెనఁగుచు వంతుకుఁ గాచుకున్నది
యీసుద్దులు వినవయ్య ఇంతి మన్నించవయ్యా
(॥॥)
అండనిట్టే నిలుచుండి ఆయముల మాటలాడి
కొండలవంటి చన్నుల గుచ్చీ నిన్ను
నిండుకొన నవ్వుచును నీకె లాచుకున్నది
దండిగాఁజూడవయ్య తరుణిఁ గావవయ్యా
(॥॥)
పానుపుపై గూచుండి పంతమునఁ గాఁగిలించి
పూనిన రతుల నిట్టే పొదిగీ నిదే
శేనగాఁ గూడీ నిదె శ్రీవేంకటేశ్వర
నానాగతి నేలవయ్య నమ్మికలీవయ్యా
(||pallavi||)
emi jūjālāḍevu yĕkkaḍa sūsevu nīvu
kāminim̐ jegŏnavayya kappuramīvayya
(||||)
sesa kŏppu vaṁchugŏni sĕkkunam̐ jĕyyiḍugŏni
āsabāḍum̐jūbu nībai naṭṭe sallīni
vāsulagu bĕnam̐gusu vaṁtugum̐ gāsugunnadi
yīsuddulu vinavayya iṁti manniṁchavayyā
(||||)
aṁḍaniṭṭe nilusuṁḍi āyamula māḍalāḍi
kŏṁḍalavaṁṭi sannula guchchī ninnu
niṁḍugŏna navvusunu nīgĕ lāsugunnadi
daṁḍigām̐jūḍavayya taruṇim̐ gāvavayyā
(||||)
pānububai gūsuṁḍi paṁtamunam̐ gām̐giliṁchi
pūnina radula niṭṭe pŏdigī nide
śhenagām̐ gūḍī nidĕ śhrīveṁkaḍeśhvara
nānāgadi nelavayya nammigalīvayyā