(॥పల్లవి॥)
ఏమి జూజాలాడేవు ఇంతులతోను
కామించి నీతోఁ బెనఁగీ కరుణించవయ్యా
(॥ఏమి॥)
వలపు నీపైఁ జల్లి వద్దనే కాచుకున్నది
చెలితోడ నిట్టె పొందుసేయరయ్యా
కలువలు గానుకిచ్చి కడుఁ బ్రియములు చెప్పీ
యెలమి నీపెకు జనవియ్యవయ్యా
(॥ఏమి॥)
వేడుకలు వెదవెట్టి వియ్యమందవచ్చె నీతో
జోడు గూడి యీపెరతిఁ జొక్కవయ్యా
వాడికలు వచరించి వచ్చి వచ్చి వేడుకొనీ
యీడ నిట్టె విన్నపము లియ్యకొనవయ్యా
(॥ఏమి॥)
ఆసలు తోడంటువెట్టి యట్టె కాఁగలించీ నిన్ను
సేన వెట్టితివి ఇఁకఁ జెనకవయ్యా
వాసితో శ్రీవేంకటశ వనిత నేలితి విట్టె
వేసరక నీకు మొక్కే విడె మియ్యవయ్యా
(||pallavi||)
emi jūjālāḍevu iṁtuladonu
kāmiṁchi nīdom̐ bĕnam̐gī karuṇiṁchavayyā
(||emi||)
valabu nībaim̐ jalli vaddane kāsugunnadi
sĕlidoḍa niṭṭĕ pŏṁduseyarayyā
kaluvalu gānugichchi kaḍum̐ briyamulu sĕppī
yĕlami nībĕgu janaviyyavayyā
(||emi||)
veḍugalu vĕdavĕṭṭi viyyamaṁdavachchĕ nīdo
joḍu gūḍi yībĕradim̐ jŏkkavayyā
vāḍigalu vasariṁchi vachchi vachchi veḍugŏnī
yīḍa niṭṭĕ vinnabamu liyyagŏnavayyā
(||emi||)
āsalu toḍaṁṭuvĕṭṭi yaṭṭĕ kām̐galiṁchī ninnu
sena vĕṭṭidivi im̐kam̐ jĕnagavayyā
vāsido śhrīveṁkaḍaśha vanida nelidi viṭṭĕ
vesaraga nīgu mŏkke viḍĕ miyyavayyā