Emi jaanadaname yevvaru metturu yidi

ఏమి జాణతనమే యెవ్వరు మెత్తురు యిది
Language

(॥పల్లవి॥)
ఏమి జాణతనమే యెవ్వరు మెత్తురు యిది
చే ముట్టి పెనఁగఁగాను జీరలు దీసేవు

(॥॥)
వేడుక నవ్వులు నీచే వెలవెట్టి కొనరాఁగా
జాడెరుఁగక పతిని జంకించేవు
వీడెము చేతికియ్యఁగా విఱ్ఱవీఁగుతా నీవు
ఆడనుండి చెలికత్తె నందుకొమ్మనేవు

(॥॥)
వెల్లవిరిమాటలు వెదవెట్టుకొని రాఁగా
కల్లలంటా రమణునిఁ గాకు సేసేవు
మల్లెపువ్వులియ్య రాఁగా మందెమేళమున నీవు
పల్లదాన పానుపుపై బరుచుమనేవు

(॥॥)
మోదముతోఁ బంతములు మునుపే యియ్య రాఁగా
కాదంటా శ్రీవేంకటేశుఁ గాఁగిలించేవు
పోదిఁ బచ్చడము గప్పి పొదుగఁగఁ సిగ్గుతోడ
తోదోపుల చెమటలు దుడువుమనేవు

(||pallavi||)
emi jāṇadaname yĕvvaru mĕtturu yidi
se muṭṭi pĕnam̐gam̐gānu jīralu dīsevu

(||||)
veḍuga navvulu nīse vĕlavĕṭṭi kŏnarām̐gā
jāḍĕrum̐gaga padini jaṁkiṁchevu
vīḍĕmu sedigiyyam̐gā viṭravīm̐gudā nīvu
āḍanuṁḍi sĕligattĕ naṁdugŏmmanevu

(||||)
vĕllavirimāḍalu vĕdavĕṭṭugŏni rām̐gā
kallalaṁṭā ramaṇunim̐ gāgu sesevu
mallĕbuvvuliyya rām̐gā maṁdĕmeḽamuna nīvu
palladāna pānububai barusumanevu

(||||)
modamudom̐ baṁtamulu munube yiyya rām̐gā
kādaṁṭā śhrīveṁkaḍeśhum̐ gām̐giliṁchevu
podim̐ bachchaḍamu gappi pŏdugam̐gam̐ siggudoḍa
todobula sĕmaḍalu duḍuvumanevu