ఏమి జాణతనా లాడే వింకా నీవు
(॥పల్లవి॥)
ఏమి జాణతనా లాడే వింకా నీవు
ఆ మాటే నిక్కమౌనె ఆతని వలనను
(॥॥)
సుదతిరో నీవద్దఁ గూచున్న చుట్ట మెవ్వఁడే
మదనగురుఁడే వీఁడు మాయింటిలోన
అదియేమె నావిభుఁడౌట నీ వెఱఁగవా
కదిసి నన్నేలేనంటేఁ గాదనఁగవచ్చునా
(॥॥)
యెవ్వరితో నవ్వితివే యిందాఁకా నీవు
నివ్వటిల్ల గిలిగించీనే కృష్ణుఁడు
యివ్వల నాకిచ్చిన బాసెరఁగవా
చివ్వనఁ బొందు సేయఁగ సిగ్గులు వడుదునా
(॥॥)
నీమంచమేపై నెవ్వఁడు నీటు చూపీనే: నన్నుఁ
బ్రేము శ్రీ వేంకటేశుఁడు పెండ్లాడెనే
ఆముందే నన్నుఁ బెండ్లాడె నదెరఁగవా
నామగఁడ ననఁగా మానఁగవచ్చునా
(||pallavi||)
emi jāṇadanā lāḍe viṁkā nīvu
ā māḍe nikkamaunĕ ādani valananu
(||||)
sudadiro nīvaddam̐ gūsunna suṭṭa mĕvvam̐ḍe
madanagurum̐ḍe vīm̐ḍu māyiṁṭilona
adiyemĕ nāvibhum̐ḍauḍa nī vĕṟam̐gavā
kadisi nannelenaṁṭem̐ gādanam̐gavachchunā
(||||)
yĕvvarido navvidive yiṁdām̐kā nīvu
nivvaḍilla giligiṁchīne kṛṣhṇum̐ḍu
yivvala nāgichchina bāsĕram̐gavā
sivvanam̐ bŏṁdu seyam̐ga siggulu vaḍudunā
(||||)
nīmaṁchamebai nĕvvam̐ḍu nīḍu sūbīne: nannum̐
bremu śhrī veṁkaḍeśhum̐ḍu pĕṁḍlāḍĕne
āmuṁde nannum̐ bĕṁḍlāḍĕ nadĕram̐gavā
nāmagam̐ḍa nanam̐gā mānam̐gavachchunā