Emi gattugonane taa nimduvamkanu

ఏమి గట్టుకొననే తా నిందువంకను
Language

(॥పల్లవి॥)
ఏమి గట్టుకొననే తా నిందువంకను
దోమటికోరికె లెల్లా దొడ్డిఁ బెట్టెఁ గదవే

(॥ఏమి॥)
యెదురు చూచితిఁ దాను ఇందాఁకా విచ్చేసీ నని
ఇదివో తాఁ జెలి నంపె నెడమాఁటకు
గుదిగొన్నఅడియాస గుండె వట్టుకున్న నన్ను
చెదరనివలపులఁ జిమ్మ రేఁచెఁ గదవే

(॥ఏమి॥)
తత్తరించి వుండితి నేఁ దనతో మాటాడే నని
పొత్తులలేక లంపెఁ దాఁ బొద్దువోకకు
మొత్తమైనవేడుకతో ముంగిట వుండిననన్ను
చిత్తపుఁ గాఁకలలోనఁ జిక్కించెఁ గదవే

(॥ఏమి॥)
తలపోసు కుండితివి తానె పైకొనీ నని
నిలుచుండే నవ్వు నవ్వీ నీటుతోఁ దాను
అలమె శ్రీవేంకటేశుఁ డాతఁడే నన్ను బలిమి
మలకలఁ బెట్టి యట్టె మన్నించెఁ గదవే

(||pallavi||)
emi gaṭṭugŏnane tā niṁduvaṁkanu
domaḍigorigĕ lĕllā dŏḍḍim̐ bĕṭṭĕm̐ gadave

(||emi||)
yĕduru sūsidim̐ dānu iṁdām̐kā vichchesī nani
idivo tām̐ jĕli naṁpĕ nĕḍamām̐ṭagu
gudigŏnnaaḍiyāsa guṁḍĕ vaṭṭugunna nannu
sĕdaranivalabulam̐ jimma rem̐sĕm̐ gadave

(||emi||)
tattariṁchi vuṁḍidi nem̐ danado māḍāḍe nani
pŏttulalega laṁpĕm̐ dām̐ bŏdduvogagu
mŏttamainaveḍugado muṁgiḍa vuṁḍinanannu
sittabum̐ gām̐kalalonam̐ jikkiṁchĕm̐ gadave

(||emi||)
talabosu kuṁḍidivi tānĕ paigŏnī nani
nilusuṁḍe navvu navvī nīḍudom̐ dānu
alamĕ śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍe nannu balimi
malagalam̐ bĕṭṭi yaṭṭĕ manniṁchĕm̐ gadave