ఏమి గట్టుకొంటివి యింతేసి మమ్ముఁజేసి
(॥పల్లవి॥)
ఏమి గట్టుకొంటివి యింతేసి మమ్ముఁజేసి
దోమటి దొడికి మాకు దూరులు గట్టుదురా
(॥॥)
పోహణించి నీవేల పూఁచి బాససేసేవు నీ-
మోహమెల్లాఁ గంటిమి మొన్ననే నేము
వూహాపోహ లెరిఁగి వూరకున్నదాన నేను
సాహసించి చన్నులపైఁ జాఁతురా నీ చేతులు
(॥॥)
చేరి మమ్మునేల నీవు చెనక వచ్చేవు నీ-
నేరుపెల్లాఁగంటిమి నిన్ననే నేము
కూరిమిగొసరి నీగుట్టు దెలుసుకొంటిమి
మేరమీరి యింతలోనే మెట్టుదురా పాదము
(॥॥)
కొయ్యతనాన నన్నుఁగూడితి పానుపుపై నీ-
నెయ్యమెల్లాఁగంటిమి నేఁడే నేము
యియ్యెడ శ్రీవేంకటేశ యిన్నియు నియ్యకొంటిమి
నియ్యిచ్చలమోవిపయి నింతురా గుఱుతులు
(||pallavi||)
emi gaṭṭugŏṁṭivi yiṁtesi mammum̐jesi
domaḍi dŏḍigi māgu dūrulu gaṭṭudurā
(||||)
pohaṇiṁchi nīvela pūm̐si bāsasesevu nī-
mohamĕllām̐ gaṁṭimi mŏnnane nemu
vūhāboha lĕrim̐gi vūragunnadāna nenu
sāhasiṁchi sannulabaim̐ jām̐turā nī sedulu
(||||)
seri mammunela nīvu sĕnaga vachchevu nī-
nerubĕllām̐gaṁṭimi ninnane nemu
kūrimigŏsari nīguṭṭu dĕlusugŏṁṭimi
meramīri yiṁtalone mĕṭṭudurā pādamu
(||||)
kŏyyadanāna nannum̐gūḍidi pānububai nī-
nĕyyamĕllām̐gaṁṭimi nem̐ḍe nemu
yiyyĕḍa śhrīveṁkaḍeśha yinniyu niyyagŏṁṭimi
niyyichchalamovibayi niṁturā guṟudulu