Emi gattugomtivi neeviduvamtivellaam jesi

ఏమి గట్టుకొంటివి నీవిటువంటివెల్లాఁ జేసి
Language

(॥పల్లవి॥)
ఏమి గట్టుకొంటివి నీవిటువంటివెల్లాఁ జేసి
చే ముట్టి కాఁకలు దేర్చి చెలఁగించరాదా

(॥ఏమి॥)
చెంతనే చెలియ నీతో సెలవుల నగెనంటా
వింతగాఁ బూబంతిఁ గొని వేసితివి
దొంతర పులకలట్టే తోడఁదోడఁ జిమ్మిరేఁగె
చింతదేరఁ గాఁగిలించి చెక్కు నొక్కరాదా

(॥ఏమి॥)
పొలుపొంద నాకె నిన్ను బొమ్మల జంకించెనంటా
చలమున పన్నీరు పైఁ జల్లితివి
చెలప చెమటలెల్లఁ జెక్కులవడియఁ జొచ్చె
బెళకక మోవి యిచ్చి ప్రేమ నించరాదా

(॥ఏమి॥)
గునియుచు నప్పటిని కొనగోరఁ జిమ్మెనంటా
వెనుకొని పుప్పొడి పైవేసితివి
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసితి వీకెనిట్టే
ననుపున నాదరించి నమ్మించరాదా

(||pallavi||)
emi gaṭṭugŏṁṭivi nīviḍuvaṁṭivĕllām̐ jesi
se muṭṭi kām̐kalu dersi sĕlam̐giṁcharādā

(||emi||)
sĕṁtane sĕliya nīdo sĕlavula nagĕnaṁṭā
viṁtagām̐ būbaṁtim̐ gŏni vesidivi
dŏṁtara pulagalaṭṭe toḍam̐doḍam̐ jimmirem̐gĕ
siṁtaderam̐ gām̐giliṁchi sĕkku nŏkkarādā

(||emi||)
pŏlubŏṁda nāgĕ ninnu bŏmmala jaṁkiṁchĕnaṁṭā
salamuna pannīru paim̐ jallidivi
sĕlaba sĕmaḍalĕllam̐ jĕkkulavaḍiyam̐ jŏchchĕ
bĕḽagaka movi yichchi prema niṁcharādā

(||emi||)
guniyusu nappaḍini kŏnagoram̐ jimmĕnaṁṭā
vĕnugŏni puppŏḍi paivesidivi
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasidi vīgĕniṭṭe
nanubuna nādariṁchi nammiṁcharādā