Emi gattugomtivi nee vimduvamkanu

ఏమి గట్టుకొంటివి నీ విందువంకను
Language

(॥పల్లవి॥)
ఏమి గట్టుకొంటివి నీ విందువంకను
కామించిన మే లొక్కటే కట్టుకొనరాదా

(॥ఏమి॥)
కలువపువ్వుల వేసి కాఁకలు మీఁదటఁ జల్లి
చలువకు వేఁడికి సరిచేసేవు
తలుపు గొబ్బన మూసి తనువుఁ దనువురాసి
చెలరేఁగి వలపులు చిమ్మిరేఁచేవు

(॥ఏమి॥)
నెయ్యమున నవ్వు నవ్వి నిమ్మపండ్లనే రువ్వి
చయ్యాటాల రెండు సరిచేసేవు
పయ్యాడి శిరసు దువ్వి పంతములు లోలోఁదవ్వి
వుయ్యాలమంచముమీఁద వొల వేసేవు

(॥ఏమి॥)
కప్పరము నోరికిచ్చి కనుఁగొనలనే కొచ్చి
చప్పుచారుసరసాల సరిచేసేవు
యిప్పుడె శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
వుప్పతిల్లుఁ దమకము లొనఁగూరిచేవు

(||pallavi||)
emi gaṭṭugŏṁṭivi nī viṁduvaṁkanu
kāmiṁchina me lŏkkaḍe kaṭṭugŏnarādā

(||emi||)
kaluvabuvvula vesi kām̐kalu mīm̐daḍam̐ jalli
saluvagu vem̐ḍigi sarisesevu
talubu gŏbbana mūsi tanuvum̐ danuvurāsi
sĕlarem̐gi valabulu simmirem̐sevu

(||emi||)
nĕyyamuna navvu navvi nimmabaṁḍlane ruvvi
sayyāḍāla rĕṁḍu sarisesevu
payyāḍi śhirasu duvvi paṁtamulu lolom̐davvi
vuyyālamaṁchamumīm̐da vŏla vesevu

(||emi||)
kapparamu norigichchi kanum̐gŏnalane kŏchchi
sappusārusarasāla sarisesevu
yippuḍĕ śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
vuppadillum̐ damagamu lŏnam̐gūrisevu