Emi gattugomtive imtesi kuchchidaalanu

ఏమి గట్టుకొంటివే ఇంతేసి కుచ్చితాలను
Language

(॥పల్లవి॥)
ఏమి గట్టుకొంటివే ఇంతేసి కుచ్చితాలను
నేమపు మా తమకాలు నించనీరాదా

(॥ఏమి॥)
మెలుపున నీ యెమ్మెలే లెరసేవు పతితోడ
చెలఁగి మా విన్నపాలు సేయనీరాదా
అలరి యీవేళనే అడ్డాలు పొలసేవు
సొలసి కన్నులఁ గొంత చూడనీరాదా

(॥ఏమి॥)
బయలు పడ నతని పరాకులే సేసేవు
నయమున మమ్ముఁ గొంత నవ్వనీరాదా
నియమించి ఆసోదాన నీవే కొంగువట్టేవు
రయమున నావద్దికి రానీరాదా

(॥ఏమి॥)
వూరకె నీవిభుఁడంటా వూడిగేలు సే సేవు
కూరిమి నాచేత సేవ గొననీరాదా
యీరీతి శ్రీ వేంకటేశుఁ డీతఁడిట్టె నన్నుఁగూడె
గారవాన నామేలల్లాఁ గననీరాదా

(||pallavi||)
emi gaṭṭugŏṁṭive iṁtesi kuchchidālanu
nemabu mā tamagālu niṁchanīrādā

(||emi||)
mĕlubuna nī yĕmmĕle lĕrasevu padidoḍa
sĕlam̐gi mā vinnabālu seyanīrādā
alari yīveḽane aḍḍālu pŏlasevu
sŏlasi kannulam̐ gŏṁta sūḍanīrādā

(||emi||)
bayalu paḍa nadani parāgule sesevu
nayamuna mammum̐ gŏṁta navvanīrādā
niyamiṁchi āsodāna nīve kŏṁguvaṭṭevu
rayamuna nāvaddigi rānīrādā

(||emi||)
vūragĕ nīvibhum̐ḍaṁṭā vūḍigelu se sevu
kūrimi nāseda seva gŏnanīrādā
yīrīdi śhrī veṁkaḍeśhum̐ ḍīdam̐ḍiṭṭĕ nannum̐gūḍĕ
gāravāna nāmelallām̐ gananīrādā