ఏమి గట్టుకొంటి వింతి యేమనె నిన్ను
(॥పల్లవి॥)
ఏమి గట్టుకొంటి వింతి యేమనె నిన్ను
తామసించక నీ బాస తలఁచుకోరాదా
(॥ఏమి॥)
యింటికిఁ బిలువవచ్చె యిటు నీవు రాకుండఁగా
వెంటనే కోపము మాని విచ్చేయరాదా
నంటున నీ మోము చూచి నవ్వునవ్వెనిదె యాకె
దంటతనమునఁ గొంత తలయెత్తరాదా
(॥ఏమి॥)
కన్నులఁ దప్పక చూచీఁ గాంత నీ వూరకుండఁగా
పన్ని నీవే యెదురేఁగి పైకొనరాదా
మిన్నకైనా నీ మీఁద మెలపు మాటలు చల్లీ
వున్నతి నీ వందుకెల్లా నుత్తరువీరాదా
(॥ఏమి॥)
గక్కనఁ జెలియ నిన్నుఁ గాఁగిలించె ముందుముందె
చెక్కునొక్కి యీచనవు చెల్లించరాదా
మక్కువ శ్రీవేంకటేశ మంకుదేరి కూడె నాకె
అక్కడ మీముచ్చటలే యాడుకొనరాదా
(||pallavi||)
emi gaṭṭugŏṁṭi viṁti yemanĕ ninnu
tāmasiṁchaga nī bāsa talam̐sugorādā
(||emi||)
yiṁṭigim̐ biluvavachchĕ yiḍu nīvu rāguṁḍam̐gā
vĕṁṭane kobamu māni vichcheyarādā
naṁṭuna nī momu sūsi navvunavvĕnidĕ yāgĕ
daṁṭadanamunam̐ gŏṁta talayĕttarādā
(||emi||)
kannulam̐ dappaga sūsīm̐ gāṁta nī vūraguṁḍam̐gā
panni nīve yĕdurem̐gi paigŏnarādā
minnagainā nī mīm̐da mĕlabu māḍalu sallī
vunnadi nī vaṁdugĕllā nuttaruvīrādā
(||emi||)
gakkanam̐ jĕliya ninnum̐ gām̐giliṁchĕ muṁdumuṁdĕ
sĕkkunŏkki yīsanavu sĕlliṁcharādā
makkuva śhrīveṁkaḍeśha maṁkuderi kūḍĕ nāgĕ
akkaḍa mīmuchchaḍale yāḍugŏnarādā