ఏమి గంటివి నావల్ల నిట్టె కాచుక తిరిగి
(॥పల్లవి॥)
ఏమి గంటివి నావల్ల నిట్టె కాచుక తిరిగి
ఆ మీఁదఁ గదా నిన్ను నట్టె మరిగితిని
(॥ఏమి॥)
వుపచిరించ నేరక వూర కున్న నాపై నొక్క
నెపానఁ బాదాలు చాఁచి నీవే మెచ్చేవు
యెపుడూ సరస మాడ నెరఁగని ననుఁ దెచ్చి
వుపమల నాచేయి నీవొళ్లిపై వేసేవు
(॥ఏమి॥)
దవ్వుల నే నూర కున్న దగ్గరఁ బిలిచి నీవే
నవ్వులు నవ్వి ననుపు నటియించేవు
జవ్వనపు సిగ్గుతోడ సరిఁ దల వంచుకొంటే
చివ్వన నామొగ మెత్తి చెక్కు నొక్కేవూ
(॥ఏమి॥)
మాట లాడ కుండితేను మంతనము గడియించి
నీటున మందెమేళాలు నీవే సేసేవూ
గాఁటపు శ్రీవెంకటేశ గక్కనఁ గూడితి నంటా
మాటికి మాటికి నన్ను మన్నించేవూ
(||pallavi||)
emi gaṁṭivi nāvalla niṭṭĕ kāsuga tirigi
ā mīm̐dam̐ gadā ninnu naṭṭĕ marigidini
(||emi||)
vubasiriṁcha neraga vūra kunna nābai nŏkka
nĕbānam̐ bādālu sām̐si nīve mĕchchevu
yĕbuḍū sarasa māḍa nĕram̐gani nanum̐ dĕchchi
vubamala nāseyi nīvŏḽlibai vesevu
(||emi||)
davvula ne nūra kunna daggaram̐ bilisi nīve
navvulu navvi nanubu naḍiyiṁchevu
javvanabu siggudoḍa sarim̐ dala vaṁchugŏṁṭe
sivvana nāmŏga mĕtti sĕkku nŏkkevū
(||emi||)
māḍa lāḍa kuṁḍidenu maṁtanamu gaḍiyiṁchi
nīḍuna maṁdĕmeḽālu nīve sesevū
gām̐ṭabu śhrīvĕṁkaḍeśha gakkanam̐ gūḍidi naṁṭā
māḍigi māḍigi nannu manniṁchevū