ఏమి గంటి విందువంక నెమ్మెకాఁడవై
(॥పల్లవి॥)
ఏమి గంటి విందువంక నెమ్మెకాఁడవై
కామినుల మీఁదను నీ కాఁక రేఁచవలెనా
(॥॥)
గరిమ నిద్దరిసంది కైలాటాలు వెట్టితివి
వరవాత నింతేసి కావలెనా నీకు
పొరి నీకు నితవైతే భోగించవలెఁ గాక
పొరుగుల వారిలోనఁ బోరు వెట్టవలెనా
(॥॥)
గుట్టున నాపె నీ పెనుగోళ్ళు రాచితివి
వట్టి నేర్పులు మెరయవలెనా నీకు
యిట్టె నీకు నితవైతే నెదఁ బెట్టుకొందు గాక
చుట్టపు సతులలోన సూడు రేఁచవలెనా
(॥॥)
కూడియుండి సవతుల కోపములు వెంచితివి
వాడికె యీతరితీపు వలెనా నీకు
వేడుకై తే రతులు శ్రీవేంకటేశ పెంతు గాక
యీడ నన్ను నేలి వారి నింత సేయవలెనా
(||pallavi||)
emi gaṁṭi viṁduvaṁka nĕmmĕgām̐ḍavai
kāminula mīm̐danu nī kām̐ka rem̐savalĕnā
(||||)
garima niddarisaṁdi kailāḍālu vĕṭṭidivi
varavāda niṁtesi kāvalĕnā nīgu
pŏri nīgu nidavaide bhogiṁchavalĕm̐ gāga
pŏrugula vārilonam̐ boru vĕṭṭavalĕnā
(||||)
guṭṭuna nābĕ nī pĕnugoḽḽu rāsidivi
vaṭṭi nerbulu mĕrayavalĕnā nīgu
yiṭṭĕ nīgu nidavaide nĕdam̐ bĕṭṭugŏṁdu gāga
suṭṭabu sadulalona sūḍu rem̐savalĕnā
(||||)
kūḍiyuṁḍi savadula kobamulu vĕṁchidivi
vāḍigĕ yīdaridību valĕnā nīgu
veḍugai te radulu śhrīveṁkaḍeśha pĕṁtu gāga
yīḍa nannu neli vāri niṁta seyavalĕnā