Emi gadimchugonevu yimtalo nogadogade

ఏమి గడించుకొనేవు యింతలో నొకటొకటె
Language

(॥పల్లవి॥)
ఏమి గడించుకొనేవు యింతలో నొకటొకటె
చే ముట్టకంటినా ఆలసేవంటిఁ గాక

(॥॥)
యీడ నిన్ను దొబ్బితినా యింటికి రమ్మంటిఁ గాక
ఆడుకొంటినా మంచివాఁడంటిఁ గాక
పాడనోప నంటినా పని గలదంటిఁ గాక
వీడె మీకుంటినా నీకు వెగటంటిఁ గాక

(॥॥)
గందము పూయనంటినా కప్రమిచ్చే నంటిఁ గాక
పందేనకాఁగితినా చేయ వట్టితిఁ గాక
అందుకోనై తినా వూవు లందరున్నా రంటిఁ గాక
నింద వేసితినా నిన్ను నేర్పరివంటిఁ గాక

(॥॥)
కగ్గి సాము సేసితినా కాగిలించుకొంటిఁ గాక
సిగ్గువడితినా బ్రమసితిఁ గాక
వొగ్గి శ్రీవేంకటేశుఁడ వొగి నీవే కూడితివి
వెగ్గళించితినా పొంది వెలసితిఁ గాక

(||pallavi||)
emi gaḍiṁchugŏnevu yiṁtalo nŏgaḍŏgaḍĕ
se muṭṭagaṁṭinā ālasevaṁṭim̐ gāga

(||||)
yīḍa ninnu dŏbbidinā yiṁṭigi rammaṁṭim̐ gāga
āḍugŏṁṭinā maṁchivām̐ḍaṁṭim̐ gāga
pāḍanoba naṁṭinā pani galadaṁṭim̐ gāga
vīḍĕ mīguṁṭinā nīgu vĕgaḍaṁṭim̐ gāga

(||||)
gaṁdamu pūyanaṁṭinā kapramichche naṁṭim̐ gāga
paṁdenagām̐gidinā seya vaṭṭidim̐ gāga
aṁdugonai tinā vūvu laṁdarunnā raṁṭim̐ gāga
niṁda vesidinā ninnu nerbarivaṁṭim̐ gāga

(||||)
kaggi sāmu sesidinā kāgiliṁchugŏṁṭim̐ gāga
sigguvaḍidinā bramasidim̐ gāga
vŏggi śhrīveṁkaḍeśhum̐ḍa vŏgi nīve kūḍidivi
vĕggaḽiṁchidinā pŏṁdi vĕlasidim̐ gāga