ఏమి గడించుకొనేవే ఇటే వట్టి వలపులు
(॥పల్లవి॥)
ఏమి గడించుకొనేవే ఇటే వట్టి వలపులు
ప్రేమ నాడుకొనేవేమే నీ మగఁడంటాను
(॥ఏమి॥)
చేరి యాతనిపాదము చెంత నీవే తాఁకించుక
దూరి పలికేవదేమే తోక్కెనంటాను
సారె జారుపయ్యదతో సమదిష్టి నిలుచుండి
కోరి సిగ్గువడేవేమే కొచ్చి చూచెనంటాను
(॥ఏమి॥)
పొంకానఁ జన్ను లతనిబుజాన నోరసుకొని
జంకించేవదేమే చేయిచాఁచెనంటాను
అంకెలఁ దమ్ములము సేయఁగ మోవి గదలితే
సంకెలేక నవ్వేవేమే సన్న సేసెనంటాను
(॥ఏమి॥)
కానుకగా నిమ్మపండు గదిసి నీవే యిచ్చి
ఆనవెట్టేవేమే గోరనంటెనంటాను
యే నలమేలుమంగను యేలె శ్రీవేంకటేశుఁడు
పూని కాఁగిలించేవేమే పొందెనంటాను
(||pallavi||)
emi gaḍiṁchugŏneve iḍe vaṭṭi valabulu
prema nāḍugŏneveme nī magam̐ḍaṁṭānu
(||emi||)
seri yādanibādamu sĕṁta nīve tām̐kiṁchuga
dūri paligevademe tokkĕnaṁṭānu
sārĕ jārubayyadado samadiṣhṭi nilusuṁḍi
kori sigguvaḍeveme kŏchchi sūsĕnaṁṭānu
(||emi||)
pŏṁkānam̐ jannu ladanibujāna norasugŏni
jaṁkiṁchevademe seyisām̐sĕnaṁṭānu
aṁkĕlam̐ dammulamu seyam̐ga movi gadalide
saṁkĕlega navveveme sanna sesĕnaṁṭānu
(||emi||)
kānugagā nimmabaṁḍu gadisi nīve yichchi
ānavĕṭṭeveme goranaṁṭĕnaṁṭānu
ye nalamelumaṁganu yelĕ śhrīveṁkaḍeśhum̐ḍu
pūni kām̐giliṁcheveme pŏṁdĕnaṁṭānu