ఏమి గావలెనో యీకె ఇంతేసి నిన్నుఁ జేసీని
(॥పల్లవి॥)
ఏమి గావలెనో యీకె ఇంతేసి నిన్నుఁ జేసీని
చే ముట్టి అట్టే యా మేలు చేకొనవయ్యా
(॥॥)
మురిపెముతో నవ్వీని ముసిముసి నవ్వులు
సొరిది తేటచూపులఁ జూచీని
దొరతనాల వలపు తొడిఁబడఁ జల్లీని
విరులఁ గొని వేసీని వీడెమిచ్చీని
(॥॥)
మచ్చిక మర్మాలు సోఁక మాటలు నిన్నాడీని
పచ్చి మోవి చూపి నీతోఁ బంతమాడీని
రచ్చలోన ముద్దుటుంగరము నీకుఁ జూపీని
ముచ్చట సన్నలుసేసి మొక్కు మొక్కీని
(॥॥)
కూరిమి గొసరుతాను కొంగువట్టి తీసిని
ఆరీతిఁ గాఁగిటఁగూడి అలయించీని
సారెకు శ్రీవేంకటేశ సమ్మటూరిలో నిన్నుఁ
బేరుకొని పిలిచీని ప్రియమందీని.
(||pallavi||)
emi gāvalĕno yīgĕ iṁtesi ninnum̐ jesīni
se muṭṭi aṭṭe yā melu segŏnavayyā
(||||)
muribĕmudo navvīni musimusi navvulu
sŏridi teḍasūbulam̐ jūsīni
dŏradanāla valabu tŏḍim̐baḍam̐ jallīni
virulam̐ gŏni vesīni vīḍĕmichchīni
(||||)
machchiga marmālu som̐ka māḍalu ninnāḍīni
pachchi movi sūbi nīdom̐ baṁtamāḍīni
rachchalona mudduḍuṁgaramu nīgum̐ jūbīni
muchchaḍa sannalusesi mŏkku mŏkkīni
(||||)
kūrimi gŏsarudānu kŏṁguvaṭṭi tīsini
ārīdim̐ gām̐giḍam̐gūḍi alayiṁchīni
sārĕgu śhrīveṁkaḍeśha sammaḍūrilo ninnum̐
berugŏni pilisīni priyamaṁdīni.