ఏమి గావలెనో కాని యీ యింతి నీకు
(॥పల్లవి॥)
ఏమి గావలెనో కాని యీ యింతి నీకు
చే ముంచి నీయెడలఁ జేసీ నిదె మేకు
(॥ఏమి॥)
కానుకలు నీకిచ్చి కామిని నీలోను చొచ్చి
కౌను నిక్కించి నిన్నుఁ గాఁగిఁట గుచ్చి
ఆనుకొని చనుఁగవ నాయములు గొచ్చి
యీనేరుపు చూడవయ్యా యీకె నిన్ను మెచ్చీ
(॥ఏమి॥)
వీడెము చేతఁ బట్టి వింతగా నాకులు చుట్టి
వాడిక నీముంగొంగు వంచి పట్టి
వేడుకలమాటలఁ దిట్టి వెసఁ బాదమున మెట్టి
వాడికెలు చూపు నీపె వలపులఁ దొట్టి
(॥ఏమి॥)
కూరిమి నీపై ముంచి గుట్టుతోడ సిగ్గు నించి
చేరి చిరినవ్వు నవ్వు శిరసు వంచి
యీరీతి శ్రీవేంకటేశ యెనసీ నలమేల్ మంగ
గారవించవయ్య యీకెగతులెల్లా నెంచి
(||pallavi||)
emi gāvalĕno kāni yī yiṁti nīgu
se muṁchi nīyĕḍalam̐ jesī nidĕ megu
(||emi||)
kānugalu nīgichchi kāmini nīlonu sŏchchi
kaunu nikkiṁchi ninnum̐ gām̐gim̐ṭa guchchi
ānugŏni sanum̐gava nāyamulu gŏchchi
yīnerubu sūḍavayyā yīgĕ ninnu mĕchchī
(||emi||)
vīḍĕmu sedam̐ baṭṭi viṁtagā nāgulu suṭṭi
vāḍiga nīmuṁgŏṁgu vaṁchi paṭṭi
veḍugalamāḍalam̐ diṭṭi vĕsam̐ bādamuna mĕṭṭi
vāḍigĕlu sūbu nībĕ valabulam̐ dŏṭṭi
(||emi||)
kūrimi nībai muṁchi guṭṭudoḍa siggu niṁchi
seri sirinavvu navvu śhirasu vaṁchi
yīrīdi śhrīveṁkaḍeśha yĕnasī nalamel maṁga
gāraviṁchavayya yīgĕgadulĕllā nĕṁchi