ఏమి దప్పిపోయ నీవు ఇయ్యకోరాదా
(॥పల్లవి॥)
ఏమి దప్పిపోయ నీవు ఇయ్యకోరాదా
సాములు సేయుచు తాను జట్టిగొనీ నిన్నును
(॥ఏమి॥)
మచ్చిక నీమాటలు మనసునఁ బెట్టుకొని
కచ్చుపెట్టి నవ్వె నదె కలికి
ఇచ్చుకపునీవిభుడు యెఱఁగమి సేసుకొని
అచ్చలాన చదురంగ మాడుమనీ నిన్నును
(॥ఏమి॥)
తగ నీవున్న లాగులు తనలోనే దాఁచుకొని
మొగము దప్పక చూచి ముంచీ వనిత
వగదీర తన్నుఁగానివానివలెనే పతి
పగటున మెచ్చిమెచ్చి పాడుమనీ నిన్నును
(॥ఏమి॥)
యెంచఁగ నీప్రేమ తనయెదఁ బెట్టుకొని నిన్ను
మించి వురమెక్కె నలమేలుమంగ
నించి శ్రీవేంకటేశుఁడు నేరువు సేసుక నీమో-
వంచెల నిమ్మనుచును ఆదరించి నిన్నును
(||pallavi||)
emi dappiboya nīvu iyyagorādā
sāmulu seyusu tānu jaṭṭigŏnī ninnunu
(||emi||)
machchiga nīmāḍalu manasunam̐ bĕṭṭugŏni
kachchubĕṭṭi navvĕ nadĕ kaligi
ichchugabunīvibhuḍu yĕṟam̐gami sesugŏni
achchalāna saduraṁga māḍumanī ninnunu
(||emi||)
taga nīvunna lāgulu tanalone dām̐sugŏni
mŏgamu dappaga sūsi muṁchī vanida
vagadīra tannum̐gānivānivalĕne padi
pagaḍuna mĕchchimĕchchi pāḍumanī ninnunu
(||emi||)
yĕṁcham̐ga nīprema tanayĕdam̐ bĕṭṭugŏni ninnu
miṁchi vuramĕkkĕ nalamelumaṁga
niṁchi śhrīveṁkaḍeśhum̐ḍu neruvu sesuga nīmo-
vaṁchĕla nimmanusunu ādariṁchi ninnunu