Emi dappiboya neegu nimtalonanu

ఏమి దప్పిపోయ నీకు నింతలోనను
Language

(॥పల్లవి॥)
ఏమి దప్పిపోయ నీకు నింతలోనను
చే ముట్టి కూచుండుమని చెక్కు నొక్కరాదా

(॥ఏమి॥)
గద్దెపీఁటమీఁదనుండి గక్కన లేచి నిలిచె
నిద్దురకన్నులచెలి నీవు రాఁగాను
అద్దో నీపాదాలు గుద్ది అలసి వచ్చెనిందాఁకా
అద్దలించి వుండుమని ఆనవెట్టిరాదా

(॥ఏమి॥)
చెలిమిఁద నొరగుండి చేయి దీసుక నిలిచె
నెలఁత వెరపుతోడ నీవు చూడఁగా
కొలువు సేసి సేసి గోడమరఁగుకు వచ్చె
బలిమిఁ బట్టుక పోయి పవ్వళించరాదా

(॥ఏమి॥)
తూఁగుమంచ మూగి యూగి దుమికి కయిలాగిచ్చె
చేఁగదేర నీవాపెకుఁ జేయి చాఁచఁగా
మాఁగిన మోవియిచ్చి మగువనిట్టే కూడితి
వీఁగక శ్రీవేంకటేశ వీడెమియ్యరాదా

(||pallavi||)
emi dappiboya nīgu niṁtalonanu
se muṭṭi kūsuṁḍumani sĕkku nŏkkarādā

(||emi||)
gaddĕbīm̐ṭamīm̐danuṁḍi gakkana lesi nilisĕ
nidduragannulasĕli nīvu rām̐gānu
addo nībādālu guddi alasi vachchĕniṁdām̐kā
addaliṁchi vuṁḍumani ānavĕṭṭirādā

(||emi||)
sĕlimim̐da nŏraguṁḍi seyi dīsuga nilisĕ
nĕlam̐ta vĕrabudoḍa nīvu sūḍam̐gā
kŏluvu sesi sesi goḍamaram̐gugu vachchĕ
balimim̐ baṭṭuga poyi pavvaḽiṁcharādā

(||emi||)
tūm̐gumaṁcha mūgi yūgi dumigi kayilāgichchĕ
sem̐gadera nīvābĕgum̐ jeyi sām̐sam̐gā
mām̐gina moviyichchi maguvaniṭṭe kūḍidi
vīm̐gaga śhrīveṁkaḍeśha vīḍĕmiyyarādā