ఏమి దప్పిపోయ నీకు నింతలోనను
(॥పల్లవి॥)
ఏమి దప్పిపోయ నీకు నింతలోనను
కామిని మానాపతి కరుణించవయ్యా
(॥ఏమి॥)
దేవర విచ్చేయఁగాను దిగ్గన గద్దియ ఒగ్గి
యీవల నిలుచున్నది యిదివో చెలి
పూవువలెఁ బట్టి నీవు పొదిగి కూచుండఁ బెట్టి
భావించి వెరవు దేర్చి పలికించవయ్యా
(॥ఏమి॥)
అల్లంతనే మిమ్ముఁ గని అట్టే వుద్దా లూడిచి
యిల్లి దే తలవంచుక యింతి వున్నది
చెల్లఁబో నీమెట్టిన పసిడిపాదా లాపె కిచ్చ
యెల్లగా నీతొడమీఁద నిడుకొనవయ్యా
(॥ఏమి॥)
చేరి కాఁగిలించఁగానే సిగ్గుతోడఁ దలవంచి
మేరతో నియిచ్చలోనే మెలఁగీఁ జెలి
ఆరీతినే కడపరాయఁడవై శ్రీ వేంకటేశ
సారెఁ గూడితి విట్టి చన వియ్యవయ్యా
(||pallavi||)
emi dappiboya nīgu niṁtalonanu
kāmini mānābadi karuṇiṁchavayyā
(||emi||)
devara vichcheyam̐gānu diggana gaddiya ŏggi
yīvala nilusunnadi yidivo sĕli
pūvuvalĕm̐ baṭṭi nīvu pŏdigi kūsuṁḍam̐ bĕṭṭi
bhāviṁchi vĕravu dersi paligiṁchavayyā
(||emi||)
allaṁtane mimmum̐ gani aṭṭe vuddā lūḍisi
yilli de talavaṁchuga yiṁti vunnadi
sĕllam̐bo nīmĕṭṭina pasiḍibādā lābĕ kichcha
yĕllagā nīdŏḍamīm̐da niḍugŏnavayyā
(||emi||)
seri kām̐giliṁcham̐gāne siggudoḍam̐ dalavaṁchi
merado niyichchalone mĕlam̐gīm̐ jĕli
ārīdine kaḍabarāyam̐ḍavai śhrī veṁkaḍeśha
sārĕm̐ gūḍidi viṭṭi sana viyyavayyā