Emi dappagasoosevu yegasakkemaada nenu

ఏమి దప్పకచూచేవు యెగసక్కెమాడ నేను
Language

(॥పల్లవి॥)
ఏమి దప్పకచూచేవు యెగసక్కెమాడ నేను
వేమారు మొక్కే నేను వెన్నముద్దక్రిష్ణుఁడా

(॥ఏమి॥)
కోడెకాఁడవై నీవు కోరి చన్నులంటఁగాను
వాడుమోముతోఁ దలవంచీఁ జెలి
ఆడానీడాఁ దిరిగాడి అన్ని నేరుచుకొంటివి
వీడె మియ్యఁగదవోఇ వెన్నముద్ద క్రిష్ణుఁడ

(॥ఏమి॥)
గొల్లెతలవాడలోని గోళ్లు మీఁటఁగాను
తెల్లమి నొక్కతె వచ్చి తిట్టీ నిన్ను
బల్లిదుఁడ వౌదువు బాసలు సేయకు మిఁక
వెల్లవిరాయఁ బనులు వెన్నముద్దక్రిష్ణుఁడ

(॥ఏమి॥)
సేసవెట్టుతానే వచ్చి చిమ్మిరేఁగఁ గూడఁగాను
వాసులు వంతులు నీపై వంచీ నీకె
ఆసల శ్రీవేంకటాద్రి నంతలో నన్నేలితివి
వేసారకు రతులను వెన్నముద్దక్రిష్ణుఁడా

(||pallavi||)
emi dappagasūsevu yĕgasakkĕmāḍa nenu
vemāru mŏkke nenu vĕnnamuddakriṣhṇum̐ḍā

(||emi||)
koḍĕgām̐ḍavai nīvu kori sannulaṁṭam̐gānu
vāḍumomudom̐ dalavaṁchīm̐ jĕli
āḍānīḍām̐ dirigāḍi anni nerusugŏṁṭivi
vīḍĕ miyyam̐gadavoi vĕnnamudda kriṣhṇum̐ḍa

(||emi||)
gŏllĕdalavāḍaloni goḽlu mīm̐ṭam̐gānu
tĕllami nŏkkadĕ vachchi tiṭṭī ninnu
ballidum̐ḍa vauduvu bāsalu seyagu mim̐ka
vĕllavirāyam̐ banulu vĕnnamuddakriṣhṇum̐ḍa

(||emi||)
sesavĕṭṭudāne vachchi simmirem̐gam̐ gūḍam̐gānu
vāsulu vaṁtulu nībai vaṁchī nīgĕ
āsala śhrīveṁkaḍādri naṁtalo nannelidivi
vesāragu radulanu vĕnnamuddakriṣhṇum̐ḍā