ఏమి దలఁచుకొంటివో ఇన్నాళ్లకు
(॥పల్లవి॥)
ఏమి దలఁచుకొంటివో ఇన్నాళ్లకు
నీ మన సింతటనే తనివిఁబొందెనా
(॥ఏమి॥)
వూరకే కొలనిలోన నోలలాడేమగువల-
చీరలేల తీసితివి చిన్నారివాండా
చేరి యంతటనుఁ బోక చేతులెత్తి మొక్కుమనే-
వేర యెంతకెత్తుకొంటి వేడ కొత్తరా
(॥ఏమి॥)
బాలుఁడవై మాఇండ్ల పాలారగించి ఇంకా
పాలిండ్లపై చూపు పచరించేవా
చాలదంటూ మాకేలు చాచి యందుకొమ్మనేవు
మేలుమేలు నీగుణాలు మెచ్చితిమిరా
(॥ఏమి॥)
ఇంతు లున్నారన కిట్టె యీఁదులాడే విందు వచ్చి
ఇంతలోనె శ్రీవేంకటేశుఁడ నీవు
పంతము చేకొని మమ్ముఁ బచ్చిగాఁ గూడితివిట్టె
ఇంతచేసి మరి చీర లిచ్చితివి చాలదా
(||pallavi||)
emi dalam̐sugŏṁṭivo innāḽlagu
nī mana siṁtaḍane tanivim̐bŏṁdĕnā
(||emi||)
vūrage kŏlanilona nolalāḍemaguvala-
sīralela tīsidivi sinnārivāṁḍā
seri yaṁtaḍanum̐ boga sedulĕtti mŏkkumane-
vera yĕṁtagĕttugŏṁṭi veḍa kŏttarā
(||emi||)
bālum̐ḍavai māiṁḍla pālāragiṁchi iṁkā
pāliṁḍlabai sūbu pasariṁchevā
sāladaṁṭū māgelu sāsi yaṁdugŏmmanevu
melumelu nīguṇālu mĕchchidimirā
(||emi||)
iṁtu lunnārana kiṭṭĕ yīm̐dulāḍe viṁdu vachchi
iṁtalonĕ śhrīveṁkaḍeśhum̐ḍa nīvu
paṁtamu segŏni mammum̐ bachchigām̐ gūḍidiviṭṭĕ
iṁtasesi mari sīra lichchidivi sāladā