Emi dakkuvaaya neegu nimduvamkanu

ఏమి దక్కువాయ నీకు నిందువంకను
Language

(॥పల్లవి॥)
ఏమి దక్కువాయ నీకు నిందువంకను
కామిని సేసే బత్తిఁ గైకొనరాదా

(॥ఏమి॥)
కన్నులనే కొసరుచు కాఁకలు నీపైఁ జల్లీ
అన్నిటా నదేమని యడుగరాదా
చిన్ననాఁడే బాస యిచ్చి సేసలు వెట్టితివట
మన్నించి యట్లానే మనుపరాదా

(॥ఏమి॥)
పలుకుచు సతి నీపచ్చడము కొంగంటీ
నిలిచి మారుమాఁట నీవాడరాదా
అలరుఁజవికెలోన అసలఁబెట్టితివట
తలపోఁత లీడేర్చి దయఁజూడరాదా

(॥ఏమి॥)
నవ్వుతా నలమేలుమంగ నంటున నీవురమెక్కే
నివ్వటిల్ల నీమచ్చిక నెరపరాదా
రవ్వగా శ్రీవేంకటేశ రతుల మెచ్చితివట
జవ్వనికి నన్నిటాను చనవియ్యరాదా

(||pallavi||)
emi dakkuvāya nīgu niṁduvaṁkanu
kāmini sese battim̐ gaigŏnarādā

(||emi||)
kannulane kŏsarusu kām̐kalu nībaim̐ jallī
anniḍā nademani yaḍugarādā
sinnanām̐ḍe bāsa yichchi sesalu vĕṭṭidivaḍa
manniṁchi yaṭlāne manubarādā

(||emi||)
palugusu sadi nībachchaḍamu kŏṁgaṁṭī
nilisi mārumām̐ṭa nīvāḍarādā
alarum̐javigĕlona asalam̐bĕṭṭidivaḍa
talabom̐ta līḍersi dayam̐jūḍarādā

(||emi||)
navvudā nalamelumaṁga naṁṭuna nīvuramĕkke
nivvaḍilla nīmachchiga nĕrabarādā
ravvagā śhrīveṁkaḍeśha radula mĕchchidivaḍa
javvanigi nanniḍānu sanaviyyarādā