Emi dabamu seseno yeedamdu neegumgaam dolli

ఏమి దపము సేసెనో యీతఁడు నీకుఁగాఁ దొల్లి
Language

(॥పల్లవి॥)
ఏమి దపము సేసెనో యీతఁడు నీకుఁగాఁ దొల్లి
ప్రేమతోడ నురమునఁ బెట్టుకున్నాఁ డిపుడు

(॥॥)
పండు వెన్నెల బయలు పడఁతి నీనవ్వుమోము
కొండల వేఁటపొలము గొప్పచన్నులు
పండెడిపూఁబొదవిల్లు బాహులతలకాఁగిలి
అండ నీపతిభాగ్య మేమని చెప్పేమే

(॥॥)
పొత్తులబోజనసాల పొలఁతి నీవదనము
హత్తినకొలువుకూటాలాయఁదొడలు
గుత్తపు సాముకంబము కోమలమైనగళము
ఇత్తల నీరమణుఁడు ఇన్నిటాను ఘనుఁడే

(॥॥)
వాటపుఁ బెండ్లిచవికె వనిత నీపిరుఁదు
మేఁటిరాజ్యపదవి నీ మేనల్లాను
యీటున శ్రీ వేంకటేశుఁడింతలోనె నిన్నుఁగూడె
బోఁటి నీవిభుఁ డీతనిఁ బొగడఁగ వసమా

(||pallavi||)
emi dabamu sesĕno yīdam̐ḍu nīgum̐gām̐ dŏlli
premadoḍa nuramunam̐ bĕṭṭugunnām̐ ḍibuḍu

(||||)
paṁḍu vĕnnĕla bayalu paḍam̐ti nīnavvumomu
kŏṁḍala vem̐ṭabŏlamu gŏppasannulu
paṁḍĕḍibūm̐bŏdavillu bāhuladalagām̐gili
aṁḍa nībadibhāgya memani sĕppeme

(||||)
pŏttulabojanasāla pŏlam̐ti nīvadanamu
hattinagŏluvugūḍālāyam̐dŏḍalu
guttabu sāmugaṁbamu komalamainagaḽamu
ittala nīramaṇum̐ḍu inniḍānu ghanum̐ḍe

(||||)
vāḍabum̐ bĕṁḍlisavigĕ vanida nībirum̐du
mem̐ṭirājyabadavi nī menallānu
yīḍuna śhrī veṁkaḍeśhum̐ḍiṁtalonĕ ninnum̐gūḍĕ
bom̐ṭi nīvibhum̐ ḍīdanim̐ bŏgaḍam̐ga vasamā