Emi baamti nijamulu yeegaalamu

ఏమి బాఁతి నిజములు యీకాలము
Language

(॥పల్లవి॥)
ఏమి బాఁతి నిజములు యీకాలము
జాముజాము కొకటైన సటలే చాలు

(॥॥)
గక్కన మాఁటాడఁబోతేఁ గలది గలట్టె
మొక్కలాన నూరకుండు మోనమే చాలు
చక్కఁ జూడఁబోతేను సందేహాలే యప్పటిని
వక్కణించరానితలవంపులే చాలు

(॥॥)
పచ్చిగా నవ్వఁబోతే పనులెల్లాఁ గానఁబడీ
కొచ్చి మమ్ముఁ దడవకు కోపమే చాలు
అచ్చపుటేకతమైతే అయములు రేఁగీని
యిచ్చటఁ జెలులసందడిదియే చాలు

(॥॥)
పానుపు మీఁదికిఁ బోతేఁ బంతమెల్లా బయలయ్యీ
నానఁబెట్టి యీయెదుటినటనే చాలు
మానక శ్రీ వేంకటేశ మరి నన్నుఁ గూడితివి
కానఁబడ్డ ఇందుకంటే కతలే చాలు

(||pallavi||)
emi bām̐ti nijamulu yīgālamu
jāmujāmu kŏgaḍaina saḍale sālu

(||||)
gakkana mām̐ṭāḍam̐bodem̐ galadi galaṭṭĕ
mŏkkalāna nūraguṁḍu moname sālu
sakkam̐ jūḍam̐bodenu saṁdehāle yappaḍini
vakkaṇiṁcharānidalavaṁpule sālu

(||||)
pachchigā navvam̐bode panulĕllām̐ gānam̐baḍī
kŏchchi mammum̐ daḍavagu kobame sālu
achchabuḍegadamaide ayamulu rem̐gīni
yichchaḍam̐ jĕlulasaṁdaḍidiye sālu

(||||)
pānubu mīm̐digim̐ bodem̐ baṁtamĕllā bayalayyī
nānam̐bĕṭṭi yīyĕduḍinaḍane sālu
mānaga śhrī veṁkaḍeśha mari nannum̐ gūḍidivi
kānam̐baḍḍa iṁdugaṁṭe kadale sālu