ఏమి బాఁతి నే నీకు యిటు నాకె దక్కితిని
(॥పల్లవి॥)
ఏమి బాఁతి నే నీకు యిటు నాకె దక్కితిని
దోమటి నిందుకె పో నీ తొత్త నైతి నేను
(॥ఏమి॥)
మన్నించి విచ్చేసితివి మా యింటికి నేఁడునీవు
కన్నుసన్న నేసితేనె కా దన వైతి
పిన్నదాన నవక నా ప్రియమె చేకొంటివి
యిన్నేసి నావలపుల కెల్లా లోనైతివి
(॥ఏమి॥)
తప్పక చూచినంతలో దగ్గరి కూచుండితివి
కప్పురవిడె మిచ్చితేఁ గైకొంటివి
చెప్పినట్టల్లాఁ జేసి చేఁతలకు గురైతివి
యిప్పుడు నా యంకెలకు యియ్యకో లైతివి
(॥ఏమి॥)
గక్కనఁ గాగిలించితే కన్నులు దేలించితివి
పక్కన నా రతులకు భ్రమసితివి
యిక్కువ శ్రీవెంకటేశ యిందునె నన్ను గూడితి
మిక్కిలి నాయెడ కూనుమేలువాఁడ వైతివి
(||pallavi||)
emi bām̐ti ne nīgu yiḍu nāgĕ dakkidini
domaḍi niṁdugĕ po nī tŏtta naidi nenu
(||emi||)
manniṁchi vichchesidivi mā yiṁṭigi nem̐ḍunīvu
kannusanna nesidenĕ kā dana vaidi
pinnadāna navaga nā priyamĕ segŏṁṭivi
yinnesi nāvalabula kĕllā lonaidivi
(||emi||)
tappaga sūsinaṁtalo daggari kūsuṁḍidivi
kappuraviḍĕ michchidem̐ gaigŏṁṭivi
sĕppinaṭṭallām̐ jesi sem̐talagu guraidivi
yippuḍu nā yaṁkĕlagu yiyyago laidivi
(||emi||)
gakkanam̐ gāgiliṁchide kannulu deliṁchidivi
pakkana nā radulagu bhramasidivi
yikkuva śhrīvĕṁkaḍeśha yiṁdunĕ nannu gūḍidi
mikkili nāyĕḍa kūnumeluvām̐ḍa vaidivi