ఏఁగివచ్చుఁగాని యీతఁ డింట నింట వాడ వాడ
(॥పల్లవి॥)
ఏఁగివచ్చుఁగాని యీతఁ డింట నింట వాడ వాడ
మూఁగిన యీ సింగారమోహనముతోడను
(॥ఏగి॥)
పెట్టినకస్తూరిబొట్టు బేంట్లెగయకుండ
కట్టినహారము లెందుఁ గదలకుండ
నిట్టతురుమువిరులు నవ్వటిల్లి రాలకుండ-
నిట్టె అందలముపై నెక్కించరే
(॥ఏగి॥)
మొగిఁ జెంగావిరెంటెము నెరి విరుగకుండ
చిగురుమోవిగచ్చు చెదరకుండ
అగలు గందపుఁబూఁత అందునిందు నంటకుండ
యెగనెత్తి అందల మెక్కించరే
(॥ఏగి॥)
కూడినకూటములగుఱుతులు మాయకుండ
వీడెపుమదము చొక్కు విడువకుండ
వేడుకకాఁడైన శ్రీవేంకటేశు నండ నన్ను
యీడుదోడై యందలాన నెక్కించరె
(||pallavi||)
em̐givachchum̐gāni yīdam̐ ḍiṁṭa niṁṭa vāḍa vāḍa
mūm̐gina yī siṁgāramohanamudoḍanu
(||egi||)
pĕṭṭinagastūribŏṭṭu beṁṭlĕgayaguṁḍa
kaṭṭinahāramu lĕṁdum̐ gadalaguṁḍa
niṭṭadurumuvirulu navvaḍilli rālaguṁḍa-
niṭṭĕ aṁdalamubai nĕkkiṁchare
(||egi||)
mŏgim̐ jĕṁgāvirĕṁṭĕmu nĕri virugaguṁḍa
sigurumovigachchu sĕdaraguṁḍa
agalu gaṁdabum̐būm̐ta aṁduniṁdu naṁṭaguṁḍa
yĕganĕtti aṁdala mĕkkiṁchare
(||egi||)
kūḍinagūḍamulaguṟudulu māyaguṁḍa
vīḍĕbumadamu sŏkku viḍuvaguṁḍa
veḍugagām̐ḍaina śhrīveṁkaḍeśhu naṁḍa nannu
yīḍudoḍai yaṁdalāna nĕkkiṁcharĕ