ఏమేమి సేయఁగాను ఇంకా నేమేమి వుట్టునో
(॥పల్లవి॥)
ఏమేమి సేయఁగాను ఇంకా నేమేమి వుట్టునో
నేమముతో నుండేనయ్య నేరుతునా నేను
(॥ఏమే॥)
సారెకును నవ్వఁగాను చలములు రేఁగెను
మేరమీరి మొక్కఁగాను మించెఁబంతము
పేరుకొని పిలువఁగా బిగినే వింతటిలోనె
వూరకుండేనయ్య నీతో వోపుదునా నేను
(॥ఏమే॥)
వేడుకతో మాటాడఁగ వెంగెము లందులో నుండె
వాడకెకు గదిసితే వాసిపుట్టెను
వూడిగలు సేసితేను వొద్దికఁ గాలు దాఁకెను
జాడతో నుండేనయ్య సాదించఁగలనా
(॥ఏమే॥)
తప్పక చూడఁగాను తమకములెల్లా నిండె
కప్పురాన వేసితేను కళదాఁకెను
ఇప్పుడు శ్రీవేంకటేశ యెనసితివిటు నన్ను
మెప్పించి వుండేనయ్య మేరమీ రే దాననా
(||pallavi||)
ememi seyam̐gānu iṁkā nememi vuṭṭuno
nemamudo nuṁḍenayya nerudunā nenu
(||eme||)
sārĕgunu navvam̐gānu salamulu rem̐gĕnu
meramīri mŏkkam̐gānu miṁchĕm̐baṁtamu
perugŏni piluvam̐gā bigine viṁtaḍilonĕ
vūraguṁḍenayya nīdo vobudunā nenu
(||eme||)
veḍugado māḍāḍam̐ga vĕṁgĕmu laṁdulo nuṁḍĕ
vāḍagĕgu gadiside vāsibuṭṭĕnu
vūḍigalu sesidenu vŏddigam̐ gālu dām̐kĕnu
jāḍado nuṁḍenayya sādiṁcham̐galanā
(||eme||)
tappaga sūḍam̐gānu tamagamulĕllā niṁḍĕ
kappurāna vesidenu kaḽadām̐kĕnu
ippuḍu śhrīveṁkaḍeśha yĕnasidiviḍu nannu
mĕppiṁchi vuṁḍenayya meramī re dānanā