ఏమేమి నేర్పెనో యీ రమణి నీకును
(॥పల్లవి॥)
ఏమేమి నేర్పెనో యీ రమణి నీకును
వేమరు నాకె బుద్దుల వెలసేవు నీవు
(॥ఏమే॥)
నెట్టన నిందాఁకా నాతో నిజములు పచరించి
ముట్టివచ్చితే నాపె మోము చూచేవు
గట్టిగా నేర్చుకొనింకాఁ గొన్ని గలిగితే
అట్టె మరఁగునఁ బోఇ అడుగఁగరాదా
(॥ఏమే॥)
జోకగా నప్పటనుండి చుట్టరికములే చూపి
దీకొంటే నాపెఁ దోడుదెచ్చుకొనేవు
మేకొని యాపె బలిమి మెరఇంచవలసితే
యేకతాన నుండి సాము లెరుఁగుకోరాదా
(॥ఏమే॥)
అంకెల నీవివి(నీవి?)ప్పు డిట్టె ఆసతోడ నన్నుఁగూడి
జంకించితే నీ వాపెకు సన్నసేసేవు
ఇంకా శ్రీ వేంకటేశ నేఁ డీఁడు చూపవలసితే
కొంకక నీయింట నిడుకొని వుండరాదా
(||pallavi||)
ememi nerbĕno yī ramaṇi nīgunu
vemaru nāgĕ buddula vĕlasevu nīvu
(||eme||)
nĕṭṭana niṁdām̐kā nādo nijamulu pasariṁchi
muṭṭivachchide nābĕ momu sūsevu
gaṭṭigā nersugŏniṁkām̐ gŏnni galigide
aṭṭĕ maram̐gunam̐ boi aḍugam̐garādā
(||eme||)
jogagā nappaḍanuṁḍi suṭṭarigamule sūbi
dīgŏṁṭe nābĕm̐ doḍudĕchchugŏnevu
megŏni yābĕ balimi mĕra̮iṁchavalaside
yegadāna nuṁḍi sāmu lĕrum̐gugorādā
(||eme||)
aṁkĕla nīvivi(nīvi?)ppu ḍiṭṭĕ āsadoḍa nannum̐gūḍi
jaṁkiṁchide nī vābĕgu sannasesevu
iṁkā śhrī veṁkaḍeśha nem̐ ḍīm̐ḍu sūbavalaside
kŏṁkaga nīyiṁṭa niḍugŏni vuṁḍarādā