Ememi neevu sesinaa nimpe naagu

ఏమేమి నీవు సేసినా నింపే నాకు
Language

(॥పల్లవి॥)
ఏమేమి నీవు సేసినా నింపే నాకు
యీ మేకులకు నే లోనే యిఁక నేల సిగ్గులు

(॥ఏమే॥)
మూసీఁ దనచేత నోరు ముసిముసినవ్వు రాఁగా
సేసినచేఁత నీవే చెప్పుకొనఁగ
ఆసుద్దులు వినవేడుకయ్యీ నాపెచేత నాకు
యీసరిఁగ గూచుండఁబెట్టు మిఁకనేల సిగ్గులు

(॥ఏమే॥)
నిట్టచూపులనుఁ జూచీ నివ్వెరగు గాఁగాను
నెట్టన నీ నిజములు నెరపఁగాను
గట్టిగా నడిగేను నిక్కము నాపెను నేను
యెట్టైనా రప్పించు నీ కిఁక నేల సిగ్గులు

(॥ఏమే॥)
మెచ్చీఁ దనవేలను మేనెల్లఁ గళలుబ్బఁగ
చెచ్చెర సన్న సేయఁగ శ్రీవేంకటేశ
తచ్చి నన్నే లితి విది తలపోసే నాపెతోడ
యిచ్చకములెల్లఁ జూపు మిఁకనేల సిగ్గులు

(||pallavi||)
ememi nīvu sesinā niṁpe nāgu
yī megulagu ne lone yim̐ka nela siggulu

(||eme||)
mūsīm̐ danaseda noru musimusinavvu rām̐gā
sesinasem̐ta nīve sĕppugŏnam̐ga
āsuddulu vinaveḍugayyī nābĕseda nāgu
yīsarim̐ga gūsuṁḍam̐bĕṭṭu mim̐kanela siggulu

(||eme||)
niṭṭasūbulanum̐ jūsī nivvĕragu gām̐gānu
nĕṭṭana nī nijamulu nĕrabam̐gānu
gaṭṭigā naḍigenu nikkamu nābĕnu nenu
yĕṭṭainā rappiṁchu nī kim̐ka nela siggulu

(||eme||)
mĕchchīm̐ danavelanu menĕllam̐ gaḽalubbam̐ga
sĕchchĕra sanna seyam̐ga śhrīveṁkaḍeśha
tachchi nanne lidi vidi talabose nābĕdoḍa
yichchagamulĕllam̐ jūbu mim̐kanela siggulu