ఏమేమి నీవు సేసినా నితవే నాకు
(॥పల్లవి॥)
ఏమేమి నీవు సేసినా నితవే నాకు
గామిడితనాన నిన్నుఁ గాదుగూడ దనను
(॥ఏమే॥)
వొద్ద నీవ్వెతెఁ బెట్టుకొన్న సంతోసముగాని
గద్దించి నీమీఁద మతి గలఁగదు
పొద్దున రాకుండితేను బుద్దులు చెప్పుదుఁగాని
అద్దపుమోము చిన్నఁబో దందుకల్లా నాకును
(॥ఏమే॥)
నీ వెందు వలచినా నేను సమ్మతింతుఁగాని
ఆవలిచెలులుతోడ నాడుకో నేను
చేవమీర నేడసుద్ది చెప్పినా నవ్వుదుఁగాని
వేవేలైనా నిన్ను వెంగెముగాఁ జూడను
(॥ఏమే॥)
వొక్కతెసొమ్ములు నీమైనుంటేఁ బొగడుదుఁగాని
గక్కన నేనెంతైనాఁ గాఁతాళించను
నిక్కపుశ్రీవేంకటేశ నే నలమేలుమంగను
మక్కువ నన్నేలితివి మఱవ నే నిఁకను
(||pallavi||)
ememi nīvu sesinā nidave nāgu
gāmiḍidanāna ninnum̐ gādugūḍa dananu
(||eme||)
vŏdda nīvvĕdĕm̐ bĕṭṭugŏnna saṁtosamugāni
gaddiṁchi nīmīm̐da madi galam̐gadu
pŏdduna rāguṁḍidenu buddulu sĕppudum̐gāni
addabumomu sinnam̐bo daṁdugallā nāgunu
(||eme||)
nī vĕṁdu valasinā nenu sammadiṁtum̐gāni
āvalisĕluludoḍa nāḍugo nenu
sevamīra neḍasuddi sĕppinā navvudum̐gāni
vevelainā ninnu vĕṁgĕmugām̐ jūḍanu
(||eme||)
vŏkkadĕsŏmmulu nīmainuṁṭem̐ bŏgaḍudum̐gāni
gakkana nenĕṁtainām̐ gām̐tāḽiṁchanu
nikkabuśhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
makkuva nannelidivi maṟava ne nim̐kanu