Ememi marmamulo iddarige telunu

ఏమేమి మర్మములో ఇద్దరికే తెలును
Language

(॥పల్లవి॥)
ఏమేమి మర్మములో ఇద్దరికే తెలును
వేమారుఁ బులకలతో విఱ్ఱవీఁగేరు

(॥ఏమే॥)
నిలువుఁగొప్పులతోడ నీవు నాకె మాటలాడి
సెలవుల నవ్వులతో చిమ్మిరేఁగేరు
కొలఁదికిఁ గలువలు కొప్పులనుండి జారఁగ
మెలుపున మిమ్ముమీరే మెచ్చుకొనేరు

(॥ఏమే॥)
సందడించే సొమ్ములతో సరసములాడుకొంటా
కందువసిగ్గులతోడఁ గడుమించేరు
గందపులప్పలు మేన గలగల పైరాలఁగ
విందులుగ నొండొరుల వేడుకల మించేరు

(॥ఏమే॥)
యెమ్మెలతో శ్రీవేంకటేశ యలమేల్మంగతో
వుమ్మడిరతుల నసురుసురనేరు
దొమ్మిచెమట మేనులఁ దొటతొట వడియఁగా
చిమ్ముచును ముత్తేలసేసలు చల్లేరు

(||pallavi||)
ememi marmamulo iddarige tĕlunu
vemārum̐ bulagalado viṭravīm̐geru

(||eme||)
niluvum̐gŏppuladoḍa nīvu nāgĕ māḍalāḍi
sĕlavula navvulado simmirem̐geru
kŏlam̐digim̐ galuvalu kŏppulanuṁḍi jāram̐ga
mĕlubuna mimmumīre mĕchchugŏneru

(||eme||)
saṁdaḍiṁche sŏmmulado sarasamulāḍugŏṁṭā
kaṁduvasigguladoḍam̐ gaḍumiṁcheru
gaṁdabulappalu mena galagala pairālam̐ga
viṁduluga nŏṁḍŏrula veḍugala miṁcheru

(||eme||)
yĕmmĕlado śhrīveṁkaḍeśha yalamelmaṁgado
vummaḍiradula nasurusuraneru
dŏmmisĕmaḍa menulam̐ dŏḍadŏḍa vaḍiyam̐gā
simmusunu muttelasesalu salleru