Emeenana vooragumdi yemi gattugonee nemdu

ఏమీనన వూరకుండి యేమి గట్టుకొనీ నేఁడు
Language

(॥పల్లవి॥)
ఏమీనన వూరకుండి యేమి గట్టుకొనీ నేఁడు
నా మీఁద జేఇ వేయవద్దా నవ్వేవాఁడు తాను

(॥ఏమీ॥)
వలపు రేఁచినవాఁడు వాడుదేర్చి బుజ్జగించి
కలయఁగ వద్దటవే కాఁగిట నేఁడు
పిలువనంపినవాఁడు పెనగొన్న సిగ్గుల
చలి వాపవద్దటవే సారెకుఁ దాను

(॥ఏమీ॥)
సరసమాడినవాఁడు చవిగొన మోవి ఇచ్చి
ఇరవుకోవద్దటవే ఇంతలో నేఁడు
శిరసువట్టినవాఁడు చేసన్నలకు లోనై
మరుగఁగవద్దటవే మంచివాఁడు తాను

(॥ఏమీ॥)
పానుపు చేరినవాఁడు బలిమైన నాచన్నులు
ఆనుకొనవద్దటవే అంకెల నేఁడు
సేనగా రతులఁగూడె శ్రీ వేంకటేశుఁడు నన్ను
యీ నేర్పు చూపవద్దా యిన్నాళ్లు తాను

(||pallavi||)
emīnana vūraguṁḍi yemi gaṭṭugŏnī nem̐ḍu
nā mīm̐da jei veyavaddā navvevām̐ḍu tānu

(||emī||)
valabu rem̐sinavām̐ḍu vāḍudersi bujjagiṁchi
kalayam̐ga vaddaḍave kām̐giḍa nem̐ḍu
piluvanaṁpinavām̐ḍu pĕnagŏnna siggula
sali vābavaddaḍave sārĕgum̐ dānu

(||emī||)
sarasamāḍinavām̐ḍu savigŏna movi ichchi
iravugovaddaḍave iṁtalo nem̐ḍu
śhirasuvaṭṭinavām̐ḍu sesannalagu lonai
marugam̐gavaddaḍave maṁchivām̐ḍu tānu

(||emī||)
pānubu serinavām̐ḍu balimaina nāsannulu
ānugŏnavaddaḍave aṁkĕla nem̐ḍu
senagā radulam̐gūḍĕ śhrī veṁkaḍeśhum̐ḍu nannu
yī nerbu sūbavaddā yinnāḽlu tānu