ఏమీనన రమ్మనవే యిక్కడికి రమణుని
(॥పల్లవి॥)
ఏమీనన రమ్మనవే యిక్కడికి రమణుని
ప్రేమపుదానఁ గాక బిగిసేటిదాననా
(॥॥)
ఆతఁడెటువలె నున్నా నౌఁగాదనే దాననా
చేతికిలోనేకాక శీఁట దాననా
కాతరించి తనమీఁద గాతసేసే దాననా
యేతులు తనతోఁ జూప నెడ్డదాననా
(॥॥)
తననేరములు మరి తడవేటి దాననా
మనసులోదానఁ గాక మంకుదాననా
చనవరికత్తె నంటా సాదించే దాననా
పనిలేని యెగ్గులెన్నఁ బడుచుదాననా
(॥॥)
వలపులు పెడరేఁచి వలఁబెట్టే దాననా
తలఁపులోదానఁ గాక దంటదాననా
కలసి పరమపదఘనుఁడ శ్రీవేంకటేశ
కొలఁదెఱఁగక వుండఁ గొయ్యదాననా
(||pallavi||)
emīnana rammanave yikkaḍigi ramaṇuni
premabudānam̐ gāga bigiseḍidānanā
(||||)
ādam̐ḍĕḍuvalĕ nunnā naum̐gādane dānanā
sedigilonegāga śhīm̐ṭa dānanā
kādariṁchi tanamīm̐da gādasese dānanā
yedulu tanadom̐ jūba nĕḍḍadānanā
(||||)
tananeramulu mari taḍaveḍi dānanā
manasulodānam̐ gāga maṁkudānanā
sanavarigattĕ naṁṭā sādiṁche dānanā
panileni yĕggulĕnnam̐ baḍusudānanā
(||||)
valabulu pĕḍarem̐si valam̐bĕṭṭe dānanā
talam̐pulodānam̐ gāga daṁṭadānanā
kalasi paramabadaghanum̐ḍa śhrīveṁkaḍeśha
kŏlam̐dĕṟam̐gaga vuṁḍam̐ gŏyyadānanā