Emeem jaduva nela yevvari naduga nela

ఏమీఁ జదువ నేల యెవ్వరి నడుగ నేల
Language

(॥పల్లవి॥)
ఏమీఁ జదువ నేల యెవ్వరి నడుగ నేల
వేమారుఁ దనలోఁ దానే విచారించవలెను

(॥ఏమీ॥)
కలలోనఁ జూచినవి కల్ల లౌతా నిజ మౌతాఁ
దెలిసితే నదె వుపదేశము గాదా
ములిగినాఁ బోనిక మోపించే సంసారము
తిలకించితే నుపదేశము గాదా

(॥ఏమీ॥)
నినుపైరాత్రిఁ బగలు నిద్దిరించి మేలుకొనే
దినదినములే వుపదేశము గాదా
కనుమూసి తెఱచితే కలిగీ లేని మాయఁ బొం
దిన జగ మిదే వుపదేశము గాదా

(॥ఏమీ॥)
చేవదేర వర మిచ్చే శ్రీవేంకటాద్రిమీఁది
దేవునిఁ గనుటే వుపదేశము గాదా
భావించి వేదము లెల్లాఁ బలుమారుఁ జాటఁగాను
దేవదేవుఁ డితఁ డుపదేశము గాదా

(||pallavi||)
emīm̐ jaduva nela yĕvvari naḍuga nela
vemārum̐ danalom̐ dāne visāriṁchavalĕnu

(||emī||)
kalalonam̐ jūsinavi kalla laudā nija maudām̐
dĕliside nadĕ vubadeśhamu gādā
muliginām̐ boniga mobiṁche saṁsāramu
tilagiṁchide nubadeśhamu gādā

(||emī||)
ninubairātrim̐ bagalu niddiriṁchi melugŏne
dinadinamule vubadeśhamu gādā
kanumūsi tĕṟaside kaligī leni māyam̐ bŏṁ
dina jaga mide vubadeśhamu gādā

(||emī||)
sevadera vara michche śhrīveṁkaḍādrimīm̐di
devunim̐ ganuḍe vubadeśhamu gādā
bhāviṁchi vedamu lĕllām̐ balumārum̐ jāḍam̐gānu
devadevum̐ ḍidam̐ ḍubadeśhamu gādā