ఏమీఁ దన్నుఁ దడవము ఇదివో తాను
(॥పల్లవి॥)
ఏమీఁ దన్నుఁ దడవము ఇదివో తాను
సామాన నుండిన నాతోఁ జలమా తాను
(॥ఏమీ॥)
వొద్ద వచ్చికూచుండేది వూరకైనా నవ్వేది
వద్దన్నా మానఁ డిదేఁటి వలపే తాను
సుద్దులు చెప్పవచ్చేది చూపులఁ దేలించేది
చద్దికి వేఁడికి నాతోఁ జలమా తాను
(॥ఏమీ॥)
పువ్వులు పైఁ జల్లేది బొమ్మల జంకించేది
యెవ్వరి ముందరవైనా నిదేమే తాను
రవ్వగాఁ బేరుకొనేది రమ్మని చేయివట్టేది
జవ్వనులతోడ నింతచలమా తాను
(॥ఏమీ॥)
గక్కనఁ గాఁగిలించేది కప్పుర మియ్యవచ్చేది
అక్కర నిన్నిటా జాణఁడౌనే తాను
యెక్కువ శ్రీవేంకటేశుఁ డిప్పు డిట్టె నన్నుఁగూడె
జక్కవకుచము లంటీఁ జలమా తాను
(||pallavi||)
emīm̐ dannum̐ daḍavamu idivo tānu
sāmāna nuṁḍina nādom̐ jalamā tānu
(||emī||)
vŏdda vachchigūsuṁḍedi vūragainā navvedi
vaddannā mānam̐ ḍidem̐ṭi valabe tānu
suddulu sĕppavachchedi sūbulam̐ deliṁchedi
saddigi vem̐ḍigi nādom̐ jalamā tānu
(||emī||)
puvvulu paim̐ jalledi bŏmmala jaṁkiṁchedi
yĕvvari muṁdaravainā nideme tānu
ravvagām̐ berugŏnedi rammani seyivaṭṭedi
javvanuladoḍa niṁtasalamā tānu
(||emī||)
gakkanam̐ gām̐giliṁchedi kappura miyyavachchedi
akkara ninniḍā jāṇam̐ḍaune tānu
yĕkkuva śhrīveṁkaḍeśhum̐ ḍippu ḍiṭṭĕ nannum̐gūḍĕ
jakkavagusamu laṁṭīm̐ jalamā tānu