Emee tanagemta sana vennamdoo lemi

ఏమీ తనకెంత చన వెన్నఁడూ లేమి
Language

(॥పల్లవి॥)
ఏమీ తనకెంత చన వెన్నఁడూ లేమి
కామించి వచ్చీ వావులు గలపుకొంటాను

(॥ఏమీ॥)
చేరి చేరి వూడిగాలు సేసీ నాకె నీకు నేఁడు
నేరుపుతో సలిగెలు నెరపుకొంటా
సారెకుఁ దఱచుగాను సరసము లాడీని
పేరడి చుట్టరికము పెనచుకొంటాను

(॥ఏమీ॥)
మళ్ళి మళ్ళి వచ్చి నీతో మనవు లెల్లాఁ జెప్పె
మొల్లల తురుముతోడ మురుసుకొంటా
వెల్లవిరి నేపురేఁగి వికవికనవ్వీని
చెల్లుబడిఁ దరితీపుసేసుకొంటాను

(॥ఏమీ॥)
కొచ్చి కొచ్చి యాసోదాల కొనచూపులనుఁ జూచి
పెచ్చురేఁగీ గర్వములు పెంచుకొంటా
యిచ్చట శ్రీవేంకటేశ యేలితిని నన్ను నేఁడు
తచ్చి నిన్ను తానూఁగూడి తగులుకొంటాను

(||pallavi||)
emī tanagĕṁta sana vĕnnam̐ḍū lemi
kāmiṁchi vachchī vāvulu galabugŏṁṭānu

(||emī||)
seri seri vūḍigālu sesī nāgĕ nīgu nem̐ḍu
nerubudo saligĕlu nĕrabugŏṁṭā
sārĕgum̐ daṟasugānu sarasamu lāḍīni
peraḍi suṭṭarigamu pĕnasugŏṁṭānu

(||emī||)
maḽḽi maḽḽi vachchi nīdo manavu lĕllām̐ jĕppĕ
mŏllala turumudoḍa murusugŏṁṭā
vĕllaviri neburem̐gi vigaviganavvīni
sĕllubaḍim̐ daridībusesugŏṁṭānu

(||emī||)
kŏchchi kŏchchi yāsodāla kŏnasūbulanum̐ jūsi
pĕchchurem̐gī garvamulu pĕṁchugŏṁṭā
yichchaḍa śhrīveṁkaḍeśha yelidini nannu nem̐ḍu
tachchi ninnu tānūm̐gūḍi tagulugŏṁṭānu